కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుంది అని కాంగ్రెస్ సీనియన్ నేత వి. హన్మంత్ రావు అన్నారు. బీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు అని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీసీలకు ఇప్పటి వరకు ఏం చేయలేదు.. ఇక్కడ సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి తాహసిల్దార్స్ కు పని లేకుండా చేశారు అని విమర్శించారు.
Read Also: Ntr 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా విడుదలయ్యేది అప్పుడేనా..?
వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. ప్రతి పార్లమెంట్ లో బీసీలకు మూడు సీట్లు కేటాయించాలి అని వీహెచ్ డిమాండ్ చేశాడు. రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి జిల్లాకు.. ప్రతి గ్రామానికి తీసుకువెళ్తామని హన్మంతరావు చెప్పారు. తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది అని ఆరోపించారు. త్వరలో బీసీ గర్జన సభ నిర్వహిస్తాము.. కాంగ్రెస్ బీసీ గర్జన సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యను ఆహ్వానిస్తామన్నాడు.
Read Also: Zaman Khan: హడలెత్తిస్తున్న పాకిస్తాన్ బౌలర్.. అఫ్రిది కంటే మెరుపు వేగం..!
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పని ఖతం అయింది అని వీహెచ్ కామెంట్స్ చేశాడు. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.. కేసీఆర్ మాత్రం తెలంగాణలో రైతులు చనిపోతే ఆర్ధిక సహాయం చేయలేదు కానీ.. బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతులకు మాత్రం డబ్బులు ఇచ్చారు అని విమర్శించారు. ఇప్పటికైనా బీసీల్లో చైతన్యం వచ్చింది.. బీసీలకు టిక్కెట్లు కావాలని ఎవరు అడిగినా మంచిదే దాన్ని తాను స్వాగతిస్తాను అని కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు అన్నారు.