ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే.రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్డే సందర్బంగా ఈ సినిమా కు ‘దేవర’ అనే టైటిల్ ను రివీల్ చేసారు మేకర్స్. దానితో పాటు ఎన్టీఆర్ లుక్ ని కూడా విడుదల చేసి సినిమా పై హైప్ ను పెంచారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల కానుంది.ఈ చిత్ర షూటింగ్ ఈ ఏడాది నవంబర్ లో పూర్తి చేయనున్నట్లు సమాచారం.. ఆ తరువాత వార్ 2 మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మూడు నెలలు కాల్ షీట్స్ ను ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR 31 సినిమాని సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. దీని తర్వత NTR 31 మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కంప్లీట్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా జూన్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కంప్లీట్ చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది.పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యి ఈ సినిమా థియేటర్స్ లోకి రావడానికి మరో ఆరు నెలలకి పైగా టైం పడుతుంది..ఈ విధంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా 2026 లో విడుదల అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ తో అదిరిపోయే సినిమాను తెరకెక్కిస్తాను అని ప్రశాంత్ నీల్ ఇదివరకే తెలిపారు.ఇప్పటికే కెజీఎఫ్ 2 భారీ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మరో విజయం సాధించాలని చూస్తున్నట్లు సమాచారం.