GVL Clarity on YSRCP Alliance: వైసీపీ, టీడీపీలకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎప్పటికీ దూరంగానే ఉంటుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 12న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటించిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం జిల్లాలో దాదాపు పదివేల కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుని మోడీ పేరు అడిగినట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు. సోము వీర్రాజుని మోడీ…నీ పేరు ఏంటి ? అని అడిగారు అంటూ వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. అందరినీ పరిచయం చేసుకోవాలని ప్రధాని కోరడంతో సోము వీర్రాజు అలా ప్రారంభించారన్నారు.
Read Also: Snake in Woman Mouth: మహిళ నోట్లో దూరిన పాము.. వామ్మో.. తీసిన డాక్టరే షాక్
విశాఖ రాజకీయ చరిత్రలో ప్రధానికి లభించిన ఆదరణ మరపురాని ఘట్టమని ఎంపీ జీవీఎల్ అన్నారు. ప్రధానిని విశాఖకు రావాలని ఆగస్టులోనే అభ్యర్థించినట్లు తెలిపారు. రైల్వేజోన్ పూర్తి స్థాయి అమలుకు రైల్వే బోర్డు ఆమోదం లభించిందన్న ఆయన పీఎం పర్యటనకు ముందే దశాబ్దాల నాటి కల నెరవేరిందన్నారు. 106 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన ఆదేశాలు విడుదలయ్యాయని, ఇక త్వరిగతిన రైల్వేజోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. ఇక నేషనల్ ఇంటర్ నెట్ ఎక్స్చేంజ్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని పేర్కొన్న ఆయన 2023 నాటికి ఇంటర్ నెట్ ఎక్స్చేంజ్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇక 2024 వరకు సోము వీర్రాజే బీజేపీ అధ్యక్షుడుగా ఉంటారన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ కుటుంబ, అవినీతి పార్టీలని పేర్కొన్నారు. అందుకే ఆ రెండు పార్టీలకు బీజేపీ దూరంగా ఉంటుందని స్పష్టత ఇచ్చారు. ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.