ప్రేమికురాలి కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ఆ మోజులో ఉన్నవారు మైకంలో ఉండి ఏం చేస్తారో కూడా అర్థం కాదు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో హైలెట్ అవడం కోసం జనాలు ప్రాణాలకు మించి తెగిస్తున్నారు. ఇంతకుముందు.. రీల్స్ చేయడం కోసం ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ అమ్మాయి ఎత్తైన భవనం నుంచి కిందకు వేలాడుతూ.. ఓ వీడియో తీసింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. తాజాగా.. ఇద్దరు యువకులు రీల్స్ కోసమని రెండు థార్ కార్లను సముద్రంలోకి తీసుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్ కచ్‌లోని ముంద్రా సముద్రతీరంలో జరిగింది.
తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు.. ఎవ్వరికి భయపడడు.. ఎక్కడా తగ్గడు.. ఈవెంట్ ఏదైనా ఆయన మాటలకు ఫిదా అవ్వాల్సిందే.. అలాంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి మొన్న గోవాలో ఆయన చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో చూసాము… నేడు దుబాయ్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…
వర్షాకాలం ఎలక్ట్రిక్ వాహనాలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కడ నీళ్లు ఉంటే.. అక్కడ జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వర్షాకాలం కాబట్టి ఎక్కువ నీరు రోడ్ల మీద ఉన్నప్పుడు ఎలక్ర్టిక్ కార్లతో జాగ్రత్తగా ఉండాలని.. ఎక్కువగా నీళ్లు నిలిచిన రోడ్లపై నుంచి వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని చెబుతున్నారు.