జలుబు మిమ్మల్ని తీవ్రంగా వేడి ఇస్తుందా? అయితే జామపండు తినండి మీ సమస్య తీరుతుంది. జలుబుతో బాధపడేవారు జామ తినద్దు అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే జామకాయలో జలుబు తగ్గించే లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. తీవ్రమైన జలుబుతో బాధపడేవారు పెద్దసైజు జామకాయ ని తీసుకొని అందులో గింజలు తీసేసి తినాలి. తర్వాత గ్లాస్ నీళ్ళు తాగితే అది మందుల పనిచేసి గొంతులోను ఊపిరితిత్తి లోను, కఫాన్ని తగ్గిస్తుంది. దీనితో జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక్క జలుబే కాదు.. ఇతర ఆరోగ్య సమస్యలకు జామకాయ మంచి పరిష్కారంగా పనిచేస్తుంది.
Also Read : From Rifle To Pen: గన్ వద్దు పెన్ ముద్దు.. విద్య కోసం లొంగిపోయిన మావోల ప్రయాణం..
జామ నుంచి లభించే ఫైబర్ షుగర్ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పనిచేస్తుంది. వీరు జామకాయలు నిరభ్యంతరంగా తినొచ్చు. జామకాయలు ఉండే బీ2, బీ6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి మెదటి పనితీరును మెరుగుపరుస్తాయి. తలనొప్పి, మైగ్రేన్ సమస్యలతో బాధపడేవాళ్ళు పచ్చ, జామకాయలు ముద్దలా నూరి రోజులో మూడు నాలుగు సార్లు నుదుటి మీద పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు గింజలు తీసిన జామకాయ ముక్కలను పంచదార కలిపి వాటిని మెత్తగా ఉడికించి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. దీంతో వీరి గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఆర్థరైటీస్ సమస్యతో బాధపడేవారు జామ ఆకులను ముద్దగా నూరి నొప్పి ఉన్నచోట పెడితే ఉపశమనం లభిస్తుంది. జామన ఎక్కువగా తినే వారి చర్మం ఎలాంటి మచ్చలు, ముడతలు లేకుండా మెరుస్తూ ఉంటుంది. జామకాయలో ఉండే కాపర్ థైరాయిడ్ సమస్యలకు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. జామ ఆకు రసాన్ని వెన్నెముక మీద రాస్తే మూర్చ వ్యాధి సమస్య ఉన్నవారు ఉపశమనం పొందుతారు.
Also Read : Health Tips for Bloating Problem: కడుపు ఉబ్బరంగా ఉందా? ఈ ఫుడ్స్ ట్రై చేయండి