From Rifle To Pen: ఒకప్పుడు తన చేతుల్లో రైఫిల్ పట్టుకున్న తర్వాత, కరణ్ హేమ్లా ఇప్పుడు పెన్ను పట్టుకుని మంచి భవిష్యత్తు కోసం ఛత్తీస్‌గఢ్‌లో పదోతరగతి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. 2005లో బస్తర్ డివిజన్‌లో నక్సల్స్ వ్యతిరేక ఉద్యమం ‘సల్వా జుడుం’ ప్రారంభం కావడంతో హింస చెలరేగడంతో కరణ్ హేమ్లా చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. కరణ్ హేమ్లా(26) ఇప్పుడు విద్యను పునఃప్రారంభించే అవకాశాన్ని పొందడం, అక్షరాస్యుడు కావాలనే తన కలను నెరవేర్చుకోవడం పట్ల ఉత్సాహంగా ఉన్నారు. లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులలో ఇతను ఒకడు. ముగ్గురు పురుషులు కాగా.. మరో ముగ్గురు మహిళలు ఆయుధాలను వదలివేసిన తర్వాత కబీర్‌ధామ్ జిల్లాలోని కవార్ధా నగరంలోని పోలీస్ లైన్‌లో నివసిస్తున్నారు. వారికి అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుల చొరవలో భాగంగా 10వ తరగతి స్టేట్ ఓపెన్ స్కూల్ పరీక్షకు సంబంధించిన ఫారమ్‌లను సమర్పించారు.
Crime News:కేసు విషయంలో స్టేషన్‌కు తీసుకుపోతే.. పోలీసులపై బాంబ్ వేసి పరారయ్యాడు
ఇద్దరు జంటలతో సహా లొంగిపోయిన మావోయిస్టులు కబీర్‌ధామ్ జిల్లాలోని ఛత్తీస్‌గఢ్-మధ్యప్రదేశ్ సరిహద్దులోని అడవుల్లో చురుకుగా ఉండేవారు. 2019 – 2021 మధ్య పోలీసుల ముందు లొంగిపోయారు. 2005లో సల్వాజుడుం ఉద్యమం మొదలైనప్పుడు మావోయిస్టు ప్రభావిత బీజాపూర్ జిల్లాలోని కకేకోర్మా గ్రామానికి చెందిన కరణ్ హేమ్లా ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. బస్తర్ డివిజన్‌లో అనేక పాఠశాలలు మూసివేయబడ్డాయని, విద్యార్థులు భయంతో వారి చదువును నిలిపివేయవలసి వచ్చిందని కరణ్ హేమ్లా మీడియాతో చెప్పారు. తన చదువును పునఃప్రారంభించకముందే, స్థానిక మావోయిస్టు నాయకులు అతనిని, మరొక బాలుడు భీమను (తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌లో లొంగిపోయాడు) వెంట తీసుకెళ్లి 2009లో నిషేధిత మావోయిస్టు బృందంలో ఇద్దరిని బలవంతంగా చేర్చుకున్నారని కరణ్ హేమ్లా చెప్పారు.
అతను 2016లో డివిజనల్ కమిటీ సభ్యునిగా పదోన్నతి పొంది, మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) మావోయిస్టుల జోన్‌కు బదిలీ అయ్యాడు. అక్కడ కరణ్ హేమ్లా 2021లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన అగ్రనేత మిలింద్ తెల్తుంబ్డేతో కలిసి పనిచేశాడు.కరణ్ హేమ్లా, అతని భార్య అనిత (22) కూడా మావోయిస్టు దళంలో పనిచేశారు. 2019లో ఒక శిబిరం నుండి పారిపోయి సాధారణ జీవితాన్ని గడపడానికి పోలీసుల ఎదుట లొంగిపోయారు. “మా ఇద్దరికీ చదువుపై ఆసక్తి ఉంది. నా భార్య మావోయిస్ట్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు రాయడం నేర్చుకుంది. లొంగిపోయిన తరువాత, మేము విద్యను అభ్యసించాలనుకుంటున్నాము. మేము ఇప్పుడు స్థానిక పోలీసుల సహాయంతో విద్యను అభ్యసిస్తున్నాం.” అని కరణ్ హేమ్లా చెప్పారు.
Corona Spray : ఒక్కసారి పీల్చితే .. మీరు రమ్మన్నా కరోనా రాదు
మరో లొంగిపోయిన మావోయిస్టు దంపతులు మంగ్లు వెకో (28), రాజేస్ అలియాస్ వనోజ (25) కూడా చదువుకునే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బస్తర్ వామపక్ష తీవ్రవాదానికి (ఎల్‌డబ్ల్యుఇ) వ్యతిరేకంగా మూడు దశాబ్దాలకు పైగా పోరాడుతోందని, హింసాకాండ ఫలితంగా తనలాంటి చాలా మందికి విద్యాభ్యాసానికి అంతరాయం కలిగిందని మంగ్లు వెకో అన్నారు. బీజాపూర్‌లోని భైరామ్‌గఢ్ ప్రాంతానికి చెందిన మంగ్లు వెకో 2013లో 19 ఏళ్ల వయసులో నిషేధిత బృందంలో చేరి 2020లో లొంగిపోయాడు. అతని భార్య వనోజ అతనితో పాటు జనవాణిలో కలిసిపోయింది. ఈ దంపతులకు ఒక బిడ్డ ఉంది. మంగ్లు వెకో మాట్లాడుతూ.. తన బిడ్డకు మంచి జీవితాన్ని అందించడానికి చదువు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Mir Barket Ali Khan : అధికారిక లాంఛనాలతో ముకర్రమ్ ఝా అంత్యక్రియలు
లొంగిపోయిన మావోయిస్టులు చదువుకోవాలనే కోరికను వ్యక్తం చేయడంతో వారికి పుస్తకాలు అందించి 10వ తరగతి ఓపెన్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు సహకరించామని కబీర్‌ధామ్ పోలీస్ సూపరింటెండెంట్ లాల్ ఉమేద్ సింగ్ చెప్పారు. వారికి ఉచితంగా కోచింగ్‌ను కూడా అందించనున్నట్లు తెలిపారు. “ఒక వ్యక్తి అభివృద్ధిలో విద్య అనేది కీలకమైన అంశం. లొంగిపోయిన కేడర్‌లు బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. భవిష్యత్తులో వారు స్వయం ఉపాధిని కొనసాగించవచ్చు లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు” అని సింగ్ చెప్పారు.