Health Tips for Bloating Problem: కడుపు ఉబ్బరంగా ఉందా? ఈ ఫుడ్స్ ట్రై చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్యకాలంలో వివిధ అనారోగ్య సమస్యలు తరచూ వేధిస్తున్నాయి. కడుపు ఉబ్బరంగా ఉందని చాలామంది అంటుంటారు. కడుపు ఉబ్బరం సమస్య తలెత్తడానికి మలబద్ధకం, గాలిని మింగడం, సరిగ్గా లేదా సరైన సమయానికి తినకపోవడం వంటి చాలా కారణాలు ఉంటాయి. వీటితోపాటు మనం తరచూ తినే ఆహార పదార్థాలు కూడా బ్లోటింగ్ సమస్యకు దారితీస్తాయి. చాలా మంది తాము ఆ ఫుడ్ తింటే పడడం లేదని, కడుపు బరువుగా ఉంటోందని ఫిర్యాదు చేస్తుంటారు. తమకు కొన్ని ఆహార పదార్థాలు పడవని తెలిసినా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా కడుపు ఉబ్బినట్లుగా ఉంటుంది. ఎందరు ఏం తినకపోయినా గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటారు.
Read Also: Astrology: జనవరి 09, సోమవారం దినఫలాలు
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
వివిధ రకాల ఆహారాలు తినడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తుంటాయి. ఒకవైపు, కొన్ని పదార్థాలు తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కొన్ని వంటింటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. ఈ చిట్కాల వల్ల మీ ఆరోగ్యం కుదుట పడడమే కాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దరిచేరవు.
*ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీలు తాగకుండా ఒక గ్లాసు వేడి నీరు తాగండి. ఇలా చేయడం వల్ల బాడీలో మలినాలు తొలగిపోతాయి.
* అలాగే పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం మంచిది. పెరుగు కడుపుకు మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. పెరుగులో ఉండే లక్షణాలు జీర్ణక్రియను పెంచుతాయి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచి, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.
* మజ్జిగలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మజ్జిగలో జీలకర్ర, పెసరపప్పు, నల్ల ఉప్పు వేసి కడుపులో మంట ఉంటే తాగాలి. ఈ విధంగా, తక్షణ ఉపశమనం కలుగుతుంది.
* కడుపు ఉబ్బరం ఉన్నపుడు జీలకర్ర పొడిని పెరుగులో కలిపి తింటే సమస్య నుంచి బయటపడొచ్చు.
* సోంపు జీర్ణక్రియకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది సోంపుగింజలను భోజనం తర్వాత తీసుకుంటుంటారు. సోంపును నీటిని తాగితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కడుపు ఉబ్బిన తర్వాత నీళ్లలో నానబెట్టిన సోంపు వాటర్‌ను తాగితే గ్యాస్, మలబద్ధకం సమస్యలు మీ నుంచి దూరం అవుతాయి.
* మీకు ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటే.. బొప్పాయి తినండి. అది జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిలో ఉండే పపైన్ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వుండవు. బొప్పాయిలో నల్ల ఉప్పు కలిపి తింటే ఇంకా మేలు జరుగుతుంది.
* వామ్ము తిన్నా కూడా కడుపు ఉబ్బరం సమస్యలు దూరం అవుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు.
Read Also: Cold Wave: తెలంగాణపై చలి పులి పంజా.. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పం
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!