Bhadrachalam: వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు..

  • భద్రాచలంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
  • అభిజిత్ లగ్నంలో మాంగళ్యధారణ
  • మిథిలా మైదానంలో శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు
  • భక్తుల రద్దీతో మార్మోగిన భద్రాచలం వీధులు
  • సీఎం రేవంత్ రెడ్డి దంపతులుగా హాజరు
  • రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ తరఫున పట్టువస్త్రాల సమర్పణ
  • ఉత్సవానికి హాజరైన ప్రముఖ నేతలు, ప్రజాప్రతినిధులు
Cm Revanth

Cm Revanth

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. అభిజిత్‌ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి.

READ MORE; Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ!

సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతతో కలిసి ఈ క్రతువుకు హాజరయ్యారు. స్వామివారికి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మరోవైపు టీటీడీ తరఫున ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

READ MORE; EX MLA Rachamallu: మాపై రాళ్ళతో దాడి చేసి తిరిగి కేసులు పెట్టారు..