సీతారాముల కల్యాణం కన్నులు పండుగ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై నుంచి సీతారాముల కల్యాణం తిలకించారు. అనంతరం వేడుకును ఉద్దేశించి ప్రసంగించారు. పరిపాలన అంటే రామ పాలన జరగాలని అందరూ కోరుకుంటారన్నారు. "తండ్రి మాటకు కట్టుబడి వనవాసం వెళ్లారు.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్ట లో జరుపుకుంటున్నాము.
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (ఏప్రిల్ 11) నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి సాయంత్రం 3:30 గంటలకు కడప ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుండి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్ కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు…
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి.
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం.
భక్తి, కళ, నైపుణ్యానికి మేళవింపు అంటే సిరిసిల్ల చేనేతకారుల గొప్పతనం గుర్తుకు వస్తుంది. ఆ సంప్రదాయాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తూ, శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారాముల కల్యాణానికి ఒక అరుదైన పట్టు చీరను రూపొందించి ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్. ఈ చీరకు ప్రత్యేకత ఏమిటంటే – ఇది కేవలం పట్టు చీర మాత్రమే కాదు, ఇది భక్తి రూపంలో ఓ కళాత్మక కానుక. సీతమ్మకు అర్పించే ఈ బంగారు…
ఈరోజు అంటే ఏప్రిల్ 10, ఆదివారం నాడు రామ నవమిని జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో నవమి తిథి నాడు రామ నవమిని జరుపుకుంటారు. త్రేతా యుగంలో అయోధ్యలో రాజు దశరథుడు, కౌశల్యకు శ్రీరాముడు జన్మించగా, ఆ కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకుంటారు హిందువులు. ఈ రోజు పవిత్రమైన రామ నవమితో చైత్ర నవరాత్రి ముగియనుంది. విష్ణువు ఏడవ అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీరాముని పుట్టినరోజుగా ఈ పండుగను జరుపుకుంటారు. పద్నాలుగేళ్ల అరణ్యవాసము,…
దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఏప్రిల్ 10న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ…