శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి.