డాక్టర్ ప్రీతి ఆత్మహత్య ఘటనపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సీరియస్‌గా స్పందించారు. సౌందరరాజన్ ఆదేశాల మేరకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్‌కు రాజ్ భవన్ లేఖ పంపింది. డాక్టర్ ప్రీతి మరణం భయంకరమైనదని, నిజం తెలుసుకోవడానికి సాధ్యమైన అన్ని కోణాల నుండి సమగ్ర విచారణ చేయాలని లేఖలో పేర్కొన్నారు. హెల్త్ సైన్సెస్ యూనివర్శిటీలో వేధింపులు, ర్యాగింగ్ వంటి సంఘటనలను ఎదుర్కోవటానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌పై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని తెలిపారు. మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల డ్యూటీ అవర్స్, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులలో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరును ఎస్‌ఓపీ మాన్యువల్‌ల గురించి కూడా లేఖలో ఆరా తీశారు.
Also Read : TikTok : టిక్ టాక్‌కు చెక్.. నిషేధం విధించిన కెనడా ప్రభుత్వం
గ్రీవెన్స్ రిడ్రెస్ సెల్ పనితీరు, బాధితుల సమస్యలను పరిష్కరించడం, మెడికోల ఫీడ్‌బ్యాక్ మూల్యాంకనం, వారి పని పరిస్థితులు వంటి అంశాలపై వివరణ ఇవ్వాలని రాజ్ భవన్ లేఖ రాసింది. డాక్టర్ ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గవర్నర్. సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని గవర్నర్ ఆదేశించారు. మెడికల్ కాలేజీలలో యాంటీ రాగింగ్ చర్యలు గట్టిగా తీసుకోవాలని గవర్నర్ సూచించారు.
Also Read : CM YS Jagan Open Challenge: చంద్రబాబు, పవన్‌కు జగన్ ఓపెన్ ఛాలెంజ్.. ఆ దమ్ముందా..?
మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీలలో కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరారు. మెడికల్ కాలేజీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న గవర్నర్.. పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, వారికి సంబంధించి సరైన విశ్రాంతి లాంటి అంశాలపై సరైన శ్రద్ధ పెట్టాలన్నారు. కౌన్సెలింగ్ సెంటర్ లు కూడా మహిళా మెడికోలకు ఏర్పాటు చేయాలని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు.