Sonu Sood: రొటీలపై ఉమ్మేస్తున్న వ్యక్తికి మద్దతుగా నిలిచిన యాక్టర్ సోనూ సూద్ తీవ్రంగా విమర్శల పాలవుతున్నారు. ఇదే కాకుండా అతడిని ‘‘రాముడు-శబరి’’గా పోల్చడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నారు. ‘‘ఉమ్మేసిన రోట్టెలను సోనూసూద్‌కి పార్సిల్‌గా పంపించాలి’’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదం అంతా ‘కన్వర్ యాత్ర’ నిబంధనలతో మొదలైంది. కన్వర్ యాత్రా మార్గంలోని దుకాణదారులు తమ పేర్లు కనిపించేలా బోర్డులు పెట్టాలని యూపీ, ఉత్తరాఖండ్ అధికారులు ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన సోనూసూద్, నేమ్ ప్లేట్లపై మానవత్వం ఉండాలి అని ట్వీట్ చేశారు.
దీనికి ప్రతిగా ఓ నెటిజన్, చపాతీలపై ఉమ్మివేసి తయారు చేస్తున్న ఓ యువకుడి వీడియో పోస్ట్ చేశాడు. దీనికి స్పందించని సోనూ సూద్ ‘‘ శ్రీరాముడికి శబరి ఎంగిలి పండ్లను ఇచ్చిందని, కాబట్టి నేను వాటికి ఎందుకు తినకూడదు సోదరా.? హింసను అహింస ద్వారా ఓడించవచ్చు. జైశ్రీరాం’’ అంటూ కామెంట్స్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రొట్టేలు చేసే వ్యక్తి ప్రేమతో ఉమ్మివేయడం లేదని, ఇతర మతాల వారిపై ద్వేషంతో ఇలా చేస్తున్నాడని, సోనూ సూద్ తప్పును కూడా కవర్ చేయాలని ప్రయత్నిస్తున్నాడంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, సోనూ సూద్ కామెంట్స్‌పై ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. ‘‘ సోనూ సూద్ దేవుడు, మతం గురించి తన సొంత వ్యక్తిగత పరిశోధనల ఆధారంగా సొంత రామాయణానికి దర్శకత్వం వహిస్తున్నాడనీ మీకు తెలుసు. వా క్యా బాత్ హై బాలీవుడ్ సే ఏక్ ఔర్ రామాయణ్’’ అంటూ ఎక్స్ వేదిక ఎద్దేవా చేసింది. అంతకుమందు సోనూ సూద్ ‘‘మానవత్వం’’ కామెంట్లకు ప్రతిగా కంగనా ‘‘హలాల్ స్థానంలో మానవత్వం’’ అని కామెంట్ చేశారు.
Next you know Sonu ji will direct his own Ramayana based on his own personal findings about God and religion. Wah kya baat hai Bollywood se ek aur Ramayana 👌 https://t.co/s1bWOer4Rp
— Kangana Ranaut (@KanganaTeam) July 20, 2024