చైనాతో సంబంధాలు ఉన్న కారణంగా మరోసారి కొన్ని యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ యాప్‌లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లు చైనీస్ లింక్‌లు కలిగి ఉన్నాయన్న కారణంతో వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనతో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ యాప్‍ల నిషేధ ప్రక్రియను ప్రారంభించింది. 288 చైనీస్ యాప్‍లను ఆరు నెలలుగా ప్రభుత్వం పరిశీలిస్తోందని రిపోర్టుల ద్వారా బయటికి వచ్చింది. ఆ యాప్స్ భారత వినియోగదారుల పర్సనల్ డేటాను సేకరిస్తోందని దీంట్లో తేలింది. దీంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. ఐటీ యాక్ట్ 69 కింద 232 యాప్‍లను బ్యాన్ చేసేందుకు నిర్ణయించింది. దేశ సమగ్రత, సార్యభౌమాధికారానికి భంగం కలిగిస్తున్నాయని ఆ యాప్‍లను నిషేధించింది.
Also Read: Royal Enfield EV: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ వెహికిల్..లాంచ్ ఎప్పుడంటే!
లోన్ యాప్‍ల ద్వారా రుణం తీసుకున్న కస్టమర్లను వేధిస్తున్న ఘటనలు ఇటీవల చాలా వెలుగులోకి వచ్చాయి. అప్పు చెల్లించడంలో కాస్త ఆలస్యమైనా, కొన్ని సందర్భాల్లో తీర్చినా ఇంకా ఇవ్వాలంటూ చాలా మందిని వివిధ రకాలుగా లోన్ యాప్ నిర్వాహకులు వేధించిన విషయాలు బయటికి వస్తున్నాయి. అయితే, చైనా జాతీయులు కొందరు భారతీయులను ఉద్యోగులుగా నియమించుకొని ఈ రుణ యాప్‍లను నిర్వహిస్తున్నారని ఇటీవల ఓ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఆ యాప్‍ల ద్వారా రుణం తీసుకున్న వారు కొందరు భారీ వడ్డీ కడుతున్నారని తేలింది. అధికారిక ప్లే స్టోర్లలో తొలగించినా.. బెట్టింగ్, లోన్ యాప్‍లను ఇండిపెండెంట్ లింక్‍లు, వెబ్‍సైట్ల ద్వారా కొందరు డౌన్‍లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారని తేలింది. దీంతో వీటిని పూర్తిగా నిషేధించాలని, యాక్సెస్ బ్లాక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
2020 నుంచి చైనాకు చెందిన వందలాది యాప్‍లను భారత ప్రభుత్వం నిషేధించింది. భారతీయుల డేటాను చైనీస్ యాప్‍లు సేకరిస్తున్నాయని, దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పుగా ఉన్నాయని వాటిని బ్యాన్ చేసింది. టిక్‍టాక్, వీ చాట్, పబ్‍జీ మొబైల్, క్యామ్ స్కానర్‌తో పాటు వందలాది యాప్‍లను నిషేధించింది.
Also Read: Urad Dal: మినప్పప్పు తింటే పురుషుల్లో లైంగిక సమస్యలను..