మినపప్పు (ఉరద్ దాల్) ప్రతి ఒక్కరి వంటగదిలో కచ్చితంగా ఉంటుంది. ఇది రుచికరమైనదిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.
ఈ మినపప్పును ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వినియోగిస్తారు. ఎక్కువగా దోసెల్లో మాత్రమే ఉపయోగిస్తుంటారు.
పురుషుల ఆరోగ్యానికి కూడా మినప్పప్పు చాలా మంచిది. ముఖ్యంగా లైంగిక సమస్యలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది.
మినపప్పు లో విటమిన్స్, క్యాల్షియం, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, ఆస్తమా, పక్షవాతం వంటి సమస్యలు తొలగించడానికి సహాయపడతాయి.
మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే వీటిలో తగినంత మొత్తంలో ఇనుము లభిస్తుంది.
శరీరంలో ఎనర్జీ లెవెల్ పెంచడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటులో ఇవి చాలా కీలకం.
మినపప్పు తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
ఉరద్ దాల్‌లో ఫైబర్ తగినంత పరిమాణంలో లభిస్తుంది. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేసేందుకు సహాయపడుతుంది.
ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు మినపప్పులో ఉంటాయి.
మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, ఇతర పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. పప్పులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది.
ఉదర సమస్యలు, చలవ చేసిన ముక్కు నుంచి రక్తం కారుతుంది. అటువంటి వాళ్లు మినపప్పుని మెత్తగా రుబ్బి దానిని రక్తం కారుతున్న ప్రదేశంలో పెడితే సమస్య పోతుంది.
మినపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తని పేస్టులాగ చేసి దానిలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి ముఖానికి అప్లై చేసుకుంటే పింపుల్స్ సమస్య పోతుంది.