ఎలక్ట్రిక్ వాహనాలపై మనసు పారేసుకుంటున్నారు కస్టమర్లు. భారత్‌లో వీటి సేల్స్ భారీగా పెరగడమే దీనికి సాక్ష్యం. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై దృష్టిసారించాయి. అటు 4 వీలర్స్, ఇటు 2 వీలర్స్.. ఆటో సంస్థలు అన్నింటికీ ఈవీ టచ్ ఇస్తున్నాయి. కొత్త కొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఇక యూత్‌లో క్రేజ్ పరంగా నెంబర్‌వన్‌గా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఇప్పుడు ఈవీవైపు అడుగులు వేస్తోంది. ఈవీ సెగ్మెంట్లోకి మరో 18- 24 నెలల్లో ఈ సంస్థ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 2024 చివరి నాటికి ఇండియా రోడ్ల మీద రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఈవీ మోడల్ తిరిగే అవకాశం ఉంది.
Also Read: INDvsAUS Test: స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే..గణాంకాలు ఏం చెబుతున్నాయంటే!
ఈవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోన్న రాయల్ ఎన్‌ఫీల్డ్.. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మాజీ సీటీఓ ఉమేశ్ కృష్ణప్పను తమ బోర్డులో చేర్చుకుంది. ఎలక్ట్రిక్ వెహికిల్ బిజినెస్ డెవలప్‌మెంట్ కోసం ఇండియా, యూకేలో ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ బృందాలు.. సంస్థ నుంచి వస్తున్న తొలి ఈవీపై కసరత్తులు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఈవీ సెగ్మెంట్‌పై అదనంగా 150మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఏడాదికి 1.2లక్షలు- 1.8లక్షల మధ్యలో ప్రొడక్షన్ చేయగలిగే సామర్థ్యాన్ని సాధించేందుకు చూస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోటో టైప్.. మరో 12 నెలల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని సమాచారం. 2024లో సంస్థ నుంచి తొలి ఈవీని లాంచ్ చేయాలన్న పట్టుదలతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: Dell Layoffs: లే ఆఫ్ బాటపట్టిన డెల్..6,650 ఉద్యోగులకు గుడ్‌బై