టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లో సమంత ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ తిరుగులేని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. కానీ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికి ఆమె వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పాలి. కెరీర్ మంచి పిక్స్‌లో ఉండగానే చైతన్యతో విడాకులు, అనారోగ్య సమస్యలు ఇలా దెబ్బ మీద దెబ్బ పడటంతో సమంత కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇక ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తున్న సామ్ ఈ మధ్య కాలంలో తన మాటలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సిడ్నీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్ని ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Also Read: RamCharan : ‘పెద్ది’ సినిమా ఆడియో రైట్స్‌కి భారీ ధర ?
‘ ఏది మంచిదో ఏది చెడుదో తెలియని చిన్న పిల్లవాడిని కాదు. రూల్స్ పెడితే నాకు నచ్చదు.. నాకు ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకుంటా. సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదు, ప్రయత్నించడం కూడా విజయం లో ఒక భాగమే. సినిమాల్లో నాకు నచ్చిన పాత్రలు చేస్తా, అప్పుడే నా లైఫ్ సక్సెస్ అవుతుంది’ అని తెలిపింది. అయితే ఇక్కడ సమంత మాటలు.. నాగచైతన్యను ఉద్దేశించి చేశారని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. అక్కినేని ఫ్యామిలీ, ఆమె విషయంలో కండిషన్లు పెట్టడం వల్ల విడాకులు తీసుకుని బయటకు వచ్చేసింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత, చై విడిపోయి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది. నాగచైతన్య తిరిగి మరో పెళ్లి కూడా చేసుకున్నాడు అయినప్పటికీ కూడా వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త నిత్యం వినపడుతూనే ఉంటుంది.