గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ గా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు రూ. 27 కోట్ల విలువ చేసే 48 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారుల బృందం సీజ్ చేసింది. బంగారాన్ని పేస్ట్ గా మార్చి నడుముకు కట్టుకునే బెల్ట్ లుగా మార్చి తరలించేందుకు ఓ కేటుగాడు ప్రయత్నం చేశాడు. ఆపరేషన్ గోల్డ్ మైన్ లో భాగంగా డీఆర్ఐ అధికారుల బృందం సూరత్ ఎయిర్ పోర్ట్ లో మాటు వేసింది. దుబాయ్ ప్రయాణీకుడి వద్ద 48 కేజీల అక్రమ బంగారంను వారు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం స్మగ్లింగ్ ఎవరికి అందిస్తున్నారు అనే కోణంలో అధికారుల టీమ్ కూపి లాగుతుంది.
Read Also: Girls Fighting : ఓరి నాయనో.. వీళ్ళు ఆడవాళ్లా.. రౌడీలా?
గుజరాత్ లోని సూరత్ ఎయిర్ పోర్ట్ లో 48 కేజీల బంగారం పట్టుబడడం మొదటి సారి.. కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఓ అధికారితో పాటు ముగ్గురు ప్రయాణీకులను డీఆర్ఐ అధికారుల బృందం అరెస్ట్ చేసింది. అయితే.. సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న కొంత మంది అధికారుల సహాయంతో ఈ గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్లాన్ ప్రకారం ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ కంటే ముందు ఉన్న వాష్ రూమ్ లో బంగారం ఎక్స్ ఛేంజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కస్టమ్స్ అధికారుల స్కానింగ్, చెకింగ్ కు చిక్కకుండా ఉండడానికి ప్లాన్ చేస్తుండగా.. బంగారాన్ని వాష్ రూమ్ లో ఓ అధికారికి అప్పగిస్తుండగా డీఆర్ఐ అధికారుల టీమ్ రెడ్ హాండెడ్ గా పట్టుకుంది. మొత్తం నాలుగురిని వారు అరెస్ట్ చేశారు. ఎయిర్ పోర్ట్ లో పని చేస్తున్న అధికారుల పాత్రపై డీఆర్ఐ అధికారులు సీరియస్ గా కూపి లాగుతున్నారు. ఎంత కాలం నుంచి ఈ వ్యవహారం కొనసాగుతుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు.
Read Also: Ashes 2023: ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ ఆశలు సజీవం