ఒకప్పుడు అబ్బాయిలు రోడ్లో గొడవ పడితే వీధి రౌడీలు అంటారు.. వాళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు..కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా రోడ్లు అని, అందరు చూస్తున్నారు అనే ఆలోచన లేకుండా జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు.. నడిరోడ్డుపై వీధి రౌడీల్లా తలపడుతున్నారు. జుట్లు పట్టుకుని, దుస్తులు చింపుకుని మరీ కొట్టుకుంటున్నారు. గోర్లతో రక్కుకుంటున్నారు. పది మందిలో ఉన్నామనే స్పృహ కూడా లేకుండా పబ్లిక్ లోనే ఫైటింగ్ కు దిగుతున్నారు. బట్టలు చిరిగేలా తన్నుకుంటున్నారు. ఆ ఫైట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాజ్ కోట్ లో ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకుంటున్నారు. వీరి మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాహనం క్రాసింగ్ విషయంలో అమ్మాయిల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఇద్దరు అమ్మాయిలు దారుణంగా కొట్టుకున్నారు. ఓ వ్యక్తి ఇద్దరమ్మాయిలను విడదీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వారు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఓ అమ్మాయి మరో అమ్మాయిని తన గోర్లతో రక్కడం వీడియోలో ఉంది.. ఈ గొడవ చాలా అంటే చాలా దారుణంగా జరిగింది..
చూడటానికి వారిద్దరూ చదువుకొనే అమ్మాయిలుగా ఉన్నారు..నడిరోడ్డుపై ఇద్దరమ్మాయిలు కొట్టుకుంటుంటే.. చుట్టూ చేరిన జనం నివ్వెరపోయారు. వారు తన్నుకునే విధానం చూసి వారి నోట మాట పడిపోయింది. వామ్మో అని ముక్కున వేలేసుకున్నారు..అమ్మాయిలేంటి మరీ ఇంత వరస్ట్ గా తయ్యారయ్యారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ లో అమ్మాయిల ఫైటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మాయిలు అబ్బాయిలతో అన్ని విషయాల్లో పోటీ పడుతున్నారు. అబ్బాయిలకన్నా మేము తక్కువేమీ కాదని ప్రూవ్ చేసుకుంటున్నారు.. మొత్తానికి ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. మీరు ఓ లుక్ వేసుకోండి..
#રાજકોટ: યાગ્નિક રોડ પર બે યુવતીઓ વચ્ચે છુટ્ટાહાથના મારામારી#Rajkot #Gujarat #ViralVideo pic.twitter.com/DXsSBx7Ccg
— Sanjay ᗪєsai 🇮🇳 (ᴢᴇᴇ ɴᴇᴡs) (@sanjay_desai_26) July 8, 2023