ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచిన ఆసీస్ మూడో టెస్టులో ఓటమిని చవిచూసింది. ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి ఇంగ్లండ్ తగ్గించింది. మరో రెండు టెస్టు మ్యాచులు మిగిలిన ఉన్న నేపథ్యంలో సిరీస్ గెలిచేందుకు ఇరు జట్లకు ఛాన్స్ ఉంది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీమ్ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (93 బంతుల్లో 9 ఫోర్లతో 75 పరుగులు), జాక్ క్రాలీ(55 బంతుల్లో 5 ఫోర్లతో 44 పరుగులు) క్రిస్ వోక్స్( 47 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులతో నాటౌట్ )లు రాణించారు. అయితే.. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క ఐదు వికెట్స్ తీసినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. మిగిలిన వారిలో ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ చెరో వికెట్ తీసుకున్నారు.
Read Also: Anirudh Ravichandran: సింగర్ జోనితాతో అనిరుధ్ ఎఫైర్.. ?
ఓవర్ నైట్ స్కోరు 27/0తో నాలుగో రోజు క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ టీమ్ గత కొంత కాలంగా అనుసరిస్తున్న బజ్‌బాల్ వ్యూహ్యాన్నే అమలు చేసింది. ఆట ఆరంభమైన కాసేటికి మిచెల్ స్టార్క్ఇంగ్లీష్ జట్టుకు గట్టి షాక్ ఇచ్చాడు. 23 పరుగులు చేసిన ఓపెనర్ బెన్ డకెట్‌ను ఎల్భీగా అవుట్ చేసి పెవిలియన్ కు పంపించాడు. దీంతో 47 పరుగులకే ఇంగ్లండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓ వైపు స్టార్క్ విజృంభించగా మోయిన్ అలీ(5), జో రూట్(21), బెన్ స్టోక్స్(13), జానీ బెయిర్ స్టో(5) లు విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 171 పరుగులకే కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అయితే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్ హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీతో జట్టును విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Read Also: Chhattisgarh: ఎన్నికల ముసాయిదా మేనిఫెస్టో కోసం బీజేపీ ప్యానెల్ ఏర్పాటు
ఇక ఇంగ్లండ్ జట్టు స్కోరు 230 పరుగుల వద్ద ఏడో వికెట్ రూపంలో హ్యారీ బ్యూక్ ఔట్ అయ్యాడు. ఈ టైంలో ఆసీస్ ఏదైన అద్భుతం చేస్తుందేమోనని అనిపించగా ఆ జట్టుకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండానే క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 చేయగా, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 26 పరుగుల స్వల్ప ఆధిక్యం దొరికింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కలుపుకుని ఇంగ్లాండ్ ముందు 251 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. దీన్ని ఇంగ్లండ్ టీమ్ ఛేదించడంతో విజయం సాధించింది.