Gun Fire : బ్రెజిల్‌లోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. గ్వారుల్‌హోస్‌లోని సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయంలో నల్లటి కారులో వచ్చిన గుర్తుతెలియని ముష్కరులు కాల్పులు జరిపారని,
Gas leak In Airport: మలేసియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్యాస్ లీక్ కావడంతో సుమారు 39 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌లోని సదరన్ సపోర్ట్ జోన్ సెపాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ దగ్గర గురువారం ఉదయం 11.23 గంటలకు గ్యాస్ లీక్ అయినట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సుమారు 3353 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.1.92 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. విదేశీ ప్రయాణీకులు బంగారాన్ని పేస్టుగా మార్చి లగేజ్ బ్యాగ్ లో దాచి పట్టుకొస్తుండగా తనిఖీలు చేపట్టడంతో బట్టబయలైంది. దుబాయ్ నుండి తీసుకొచ్చిన బంగారాన్ని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వాష్ రూమ్ వద్ద మరో వ్యక్తికి అప్పగిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ గా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు రూ. 27 కోట్ల విలువ చేసే 48 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారుల బృందం సీజ్ చేసింది. బంగారాన్ని పేస్ట్ గా మార్చి నడుముకు కట్టుకునే బెల్ట్ లుగా మార్చి తరలించేందుకు ఓ కేటుగాడు ప్రయత్నం చేశాడు. ఆపరేషన్ గోల్డ్ మైన్ లో భాగంగా డీఆర్ఐ అధికారుల బృందం సూరత్ ఎయిర్ పోర్ట్ లో మాటు వేసింది. దుబాయ్ ప్రయాణీకుడి…
Today Business Headlines 03-05-23: భోగాపురానికి శంకుస్థాపన: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని 4 వేల 592 కోట్ల రూపాయల వ్యయంతో 2 వేల 203 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో సారి విదేశీ బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సుధీర్ కుమార్ అనే ప్రయాణీకుడి వద్ద 47 లక్షల విలువ చేసే 827 గ్రాముల బంగారంను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
దేశంలో రోజుకు ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ఇటీవల కేరళ తీరంలో దాదాపుగా రూ. 1500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. తాజాగా మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూర్ అంతర్జాతీయ కార్గోలో పెద్ద ఎత్తున భారీగా ఎఫిడ్రీన్ పట్టివేశారు. 90 లక్షల విలువైన 5 కేజీల డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్తున్న పార్సిల్ లో ఈ డ్రగ్స్ ను దాచిపెట్టి అక్రమ రవాణా చేయాలని చూశారు. కస్టమ్ అధికారులకు ఏమాత్రం అనుమానం…