గత 2-3 సంవత్సరాలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో అయితే పసిడి రేట్స్ పరుగులు పెట్టాయి. ఈ వారం రోజుల్లో ధరలు వరుసగా పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల బంగారంపై రూ.710 పెరగగా.. ఈరోజు రూ.930 పెరిగింది. నిన్న 22 క్యారెట్లపై రూ.650, ఈరోజు రూ.850 పెరిగింది. ఈ క్రమంలో గోల్డ్ రేట్స్ 93 వేలకు చేరువైంది. ప్రస్తుతం ‘బంగారం’ పేరు వింటేనే సామాన్య జనాలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజున బంగారం ధరలు గోల్డ్ లవర్స్‌కి షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఏప్రిల్ 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.92,840గా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారంపై 110, 440, 1140, 220, 0, 710, 930 రూపాయలు పెరిగింది. దాంతో 89 వేల నుంచి 93 వేలకు చేరువైంది. పెరుగుతున్న ఈ ధరలు చూస్తే.. త్వరలోనే బంగారం లక్షకు చేరుకునేట్టు ఉంది.
Also Read: Suryakumar Yadav: టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ చరిత్ర.. మొదటి ఆటగాడిగా అరుదైన రికార్డు!
మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. నేడు కిలో వెండిపై రూ.1000 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,05,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ధర ఒక లక్ష 14 వేలుగా కొనసాగుతోంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.1,05,000గా ఉంది.