భారతదేశంలో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుందన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఓసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. ఇటీవల పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (డిసెంబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,450గా ఉంది.
Also Read: Municipal Corporation Kadapa: కడపలో ఫ్లెక్సీ వార్.. ‘హూ ఈజ్ జయశ్రీ’ అంటూ ఫ్లెక్సీలు!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా.. 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదయ్యాయి. మరోవైపు నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర.. నేడు స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గి.. రూ.91,400గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.98,900 వేలుగా ఉంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.91,400గా నమోదైంది.