Gold Price Today in India and Hyderabad: బంగారం ధరలు ఇటీవల భారీగా పెరిగి.. జీవనకాల గరిష్టాల్ని తాకిన సంగతి తెలిసిందే. పసిడి ధరలు ఏప్రిల్ నెలలో భారీగా పెరిగాయనుకుంటే.. మేలో అయితే చుక్కలు చూపించాయి. అయితే పెరిగిన ధరలు ఇటీవలి రోజుల్లో కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 5-6 రోజుల నుంచి పసిడి ధరలు స్థిరంగా లేదా తగ్గుతూ వస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల బంగారంపై రూ.400, 24 క్యారెట్ల బంగారంపై రూ.440 తగ్గింది. సోమవారం (జూన్ 3) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 66,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,110గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. సోమవారం హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,100 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,110గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,260గా నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,110గా ఉంది. ఇక బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,110గా ఉంది.
Also Read: Raveena Tandon-Kangana: కఠిన చర్యలు తీసుకోవాలి.. రవీనా టాండన్‌కు మద్దతుగా కంగనా!
నేడు వెండి ధరలు కూడా తగ్గాయి. సోమవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.700 తగ్గి.. రూ.92,800గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.92,800 ఉండగా.. ముంబైలో రూ.92,800గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.97,300లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.92,900గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.97,300లుగా ఉంది.