Gold Price : ప్రపంచంలో చోటుచేసుకున్న ఆర్థిక పరిణామాలు, వాణిజ్య పరిస్థితులు, రూపాయి విలువలో మార్పులు తదితర కారణాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నవారు మాత్రం ముందుగానే వాటి ధరలను తెలుసుకోవడం తప్పనిసరి. గత వారం రోజులుగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఆల్ టైమ్ రికార్డు ధర రూ.83,000 మార్క్‌ను టచ్ చేసింది. ఇక బంగారం కొనాలంటేనే సామాన్యులు భయపడిపోతున్నారు. ఈ సమయంలో బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఉపశమనం లభించింది. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
Read Also: Vehicle Scrapping Policy : ఈ పని చేస్తే చాలు.. జంక్ వాహనంపై మీకు డబుల్ టాక్స్ మినహాయింపు
నిన్న హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.82,420 ఉండగా.. నేడు 170 రూపాయలు తగ్గి.. రూ.82,250 వద్ద కొనసాగుతోంది. ఇక , 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై కూడా పది రూపాయలు తగ్గింది. నిన్న పది గ్రాములకు రూ.75,550 ఉండగా.. నేడు 150 రూపాయలు తగ్గి రూ.75,400కు పడిపోయింది. మరోవైపు, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,04,900 వద్ద కొనసాగుతోంది.
Read Also:Amit Shah : ప్రయాగ్‌రాజ్ చేరుకున్న హోంమంత్రి అమిత్ షా.. మరికొద్ది సేపట్లో సంగంలో పవిత్ర స్నానం