Vehicle Scrapping Policy : అధిక కాలుష్య కారకాల వాహనాలను వదిలించుకోవడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. BS-2 , అంతకు ముందు వాహనాలను దశల వారీగా తొలగింపు పనులు మొదలు పెట్టింది. వాటిని తొలగించిన తర్వాత కొత్త వాహనాల కొనుగోలుపై ఒకేసారి పన్ను రాయితీని 50 శాతానికి రెట్టింపు చేయాలని రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం పాత ప్రైవేట్ వాహనాలను రద్దు చేసిన తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేస్తే మోటారు వాహన పన్నుపై 25 శాతం తగ్గింపు ఇవ్వనుంది. అయితే వాణిజ్య వాహనాల విషయంలో ఈ తగ్గింపు 15 శాతానికి పరిమితం చేసింది.
వెహికల్ స్క్రాప్ పాలసీ అంటే ఏమిటి?
పాత, పనికిరాని వాహనాలను స్క్రాప్ చేసే సౌకర్యాన్ని ప్రభుత్వం సాధారణ ప్రజలకు అందిస్తుంది. ప్రైవేట్, వాణిజ్య వాహన యజమానులు ఇద్దరూ ఈ ప్రభుత్వ విధానాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. స్క్రాప్ పాలసీ ప్రకారం, పాత కారు, బైక్, స్కూటర్ మొదలైన వాటిని స్క్రాప్ కోసం ఇవ్వవచ్చు. ఒక ఉదాహరణ ద్వారా వివరించాలంటే.. మీ కారు 10 సంవత్సరాలు (డీజిల్) లేదా 15 సంవత్సరాలు (పెట్రోల్) పూర్తి చేసి ఉంటే ఈ పాలసీ కింద కొత్త కారు కొనేటప్పుడు పాత కారును స్క్రాప్‌లో ఇవ్వడం ద్వారా మీరు భారీ మొత్తాన్ని ఆదా చేయవచ్చు.
Read Also:Indiramma Illu Scheme: ఇందిరమ్మ ఇల్లు రాలేదని రైతు ఆత్మహత్య!
ఇప్పుడు 50శాతం పన్ను మినహాయింపు
జనవరి 24న జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌లో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ BS-1 నిబంధనలకు అనుగుణంగా ఉన్న లేదా అంతకు ముందు తయారు చేయబడిన అన్ని వాహనాలకు (వాణిజ్య, వ్యక్తిగత) 50 శాతం వరకు తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. BS-1 నిబంధనల అమలుకు సంబంధించిన అన్ని అంశాలను తయారు చేశారు. ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం, ఈ మినహాయింపు మీడియం, హెవీ ప్రైవేట్, రవాణా వాహనాల పరిధిలోకి వచ్చే BS-2 వాహనాలకు వర్తిస్తుంది. వాహనాలకు BS-1 కార్బన్ ఉద్గార ప్రమాణాలు 2000 సంవత్సరంలో తప్పనిసరి అయ్యాయి. అయితే BS-2 2002 ఏడాది నుండి అమల్లోకి వచ్చింది.
దేశంలో 75 ఏటీఎస్ కేంద్రాలు
రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపేజ్ ఫెసిలిటీస్ (RVSFలు), ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ATS) నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా 15ఏళ్లు దాటిన వాహనాలను దశలవారీగా తొలగించడానికి.. ఒక పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి రవాణా మంత్రిత్వ శాఖ స్వచ్ఛంద వాహన ఆధునీకరణ కార్యక్రమం లేదా వాహన్ స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 60 కి పైగా RVSFలు, 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 75 కి పైగా ATSలు పనిచేస్తున్నాయి. ఇంకా చాలా పనులు ప్రారంభం అవుతున్నాయి.