మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పటినుండో ఓ కథ రెడీ చేస్తున్నారు. అదే లార్డ్ కార్తికేయ (సుబ్రహ్మణ్య స్వామి) కథ. ఈ సినిమాలు GodOfWar అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్నట్టు లాంగ్ బ్యాక్ ఒక అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. హ్యటిక్స్ హిట్స్ తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో ఒక భారీ మైథలాజికల్ చిత్రానికి శ్రీకారం చుట్టారు.
Also Read : AOR Trailer : అనగనగా ఒక రాజు.. అసలైన పండగ ట్రైలర్ వచ్చేసింది..
కాని పుష్ప హిట్ తర్వాత త్రివిక్రమ్ సినిమా నుండి బన్నీ స్టెప్ అవుట్ అయ్యాడు. ఆ ప్లేస్ లోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి చేరాడు.భారీ విజువల్స్, గ్రాండ్ సెట్స్, గ్లోబల్ స్టాండర్డ్స్‌తో రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపించింది. . త్రివిక్రమ్ మార్క్ షార్ప్ డైలాగ్స్, మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను ప్రపంచ స్థాయి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించనున్నారని టాక్ నడిచింది. అయితే ఇటీవల ఈ కథ మళ్లీ అల్లు అర్జున్ కాంపౌండ్ లోకి వచ్చిందని బాలీవుడ్ నుండి ఫీలర్లు వదిలారు. దాంతో ఈ సినిమాపై గందరగోళం నెలకొంది.తాజాగా సితార నాగవంశీ అనగనగ ఒక రాజు ట్రైలర్ ఈవెంట్ లో మాట్లాడుతూ ‘ కాలర్ లు ఎగరేయడం ఇప్పుడు ఎందుకులే. మే నెల నుండి కాలర్ ఎగరేద్దాం అని ( ఎన్టీఆర్ బర్త్ డే మే9) చెప్పాడు. దాంతో GOD OF WAR జూనియర్ ఎన్టీఆర్ తోనే ఉంటుందని చెప్పకనే చెప్పేసాడు నాగవంశి. అన్ని అనుకున్నట్టు జరిగితే 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
May నుంచి కాలర్లు ఎత్తడాలు చేద్దాం
🔥⚔️:- #NagaVamsi
Hint: #GodOfWar announcement? pic.twitter.com/FfVAbPzozr
— Milagro Movies (@MilagroMovies) January 8, 2026