Girlfriend locked her boyfriend in a box Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని వీడియోలు అబ్బురపరిచే విధంగా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ప్రియురాలు తన ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Viral Video: కారు ఢీకొని బీజేపీ నాయకుడి ఆరేళ్ల కుమారుడు మృతి
వైరల్ గా మారిన వీడియోని గమనించినట్లయితే.. వీడియోలో ఇద్దరూ ఆడవారు కనపడుతున్నారు. మరొక వ్యక్తి వీడియో రికార్డు చేస్తుండడం కనబడుతుంది. అలాగే ఇంటి లోపలి ప్రాంతం మొత్తం బట్టలు, కాగితాలు చెల్లా చెదురుగా పది ఉండడటం మనం గమనించవచ్చు. అయితే, ప్రియురాలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెని కలవడానికి వచ్చిన ప్రియుడు వెళ్లాడు. అయితే ప్రియుడు ఇంట్లో ఉన్న సమయంలోనే ప్రియురాలి ఇంటి సభ్యులు ఇంటికి రావడంతో.. ఏమి చేయాలన్న ప్రియురాలు ఆలోచనతో వెంటనే తన ప్రియుడిని ఎలాగైనా కాపాడాలన్న ఉద్దేశంతో చివరికి ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసింది. అయితే, ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు అనుమానం రావడంతో.. వారు ఇంటి మొత్తం శోధించి ఆ తర్వాత ఇనుప పెట్టెను తెరవాలని కోరడంతో.. ప్రియురాలు చాలాసేపు ప్రతిఘటించి చివరికి ఇనుప పెట్టె తాళం ఓపెన్ చేసింది. దాంతో వెంటనే అందులో ఉన్న ప్రియుడు చొక్కా లేకుండా ఉండడం., అలాగే అతని శరీరం పూర్తిగా చెమటతో తడిసిపోయి ఉండడం మనం వీడియోలో గమనించవచ్చు. దీంతో వీడియో పూర్తవుతుంది.
Railway Ticket Booking: ఇకపై 60 రోజుల ముందే రైలు బుకింగ్‌ల ముందస్తు రిజర్వేషన్
ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరో ఐదు నిమిషాలు అతడు అందులో ఉండి ఉంటే కచ్చితంగా చనిపోయి ఉండేవాడని.. కొందరు కామెంట్ చేస్తుండగా, అసలు ఇలా చేయాలని ఎలా ఆలోచన వచ్చిందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
Girlfriend locked her boyfriend in a box😭
pic.twitter.com/Qb09q8wNzE— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024