Railway Ticket Booking: రైల్వే రిజర్వేషన్ టిక్కెట్ బుకింగ్ నిబంధనలను మరోమారు మార్చింది. ఇప్పుడు రిజర్వేషన్ టిక్కెట్లు అరవై రోజుల ముందుగానే బుక్ చేయబడతాయి. అయితే కొన్ని రైళ్లలో దీనికి సడలింపులు ఇచ్చారు. ఇంతకుముందు ప్రయాణీకులు 120 రోజుల ముందుగానే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కొత్త రైల్వే రిజర్వేషన్ రూల్స్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. అక్టోబరు 31లోపు అడ్వాన్స్ టిక్కెట్లను బుక్ చేసుకొనేందుకు ఈ సేవ కొనసాగుతుంది. అయితే నవంబర్ 1 నుండి, ప్రయాణికులు కేవలం అరవై రోజుల ముందుగానే కొత్త టిక్కెట్లను బుక్ చేసుకోగలరు.
Also Read: RSS: ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో కత్తులతో దాడి.. పలువురికి గాయాలు
రైల్వే బోర్డు జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, ప్రయాణీకులు తమ ప్రయాణానికి 4 నెలల ముందు రైళ్లలో రిజర్వ్ చేసిన టిక్కెట్లను తీసుకోవచ్చని 2015 నిబంధనను రద్దు చేసింది. ఇందుకు సంబంధించి నవంబర్ 1 నుండి అమల్లోకి కొత్త రూల్స్ వర్తించనున్నాయి. ఇందులో భాగంగా అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) ఇప్పుడు 60 రోజులు (ప్రయాణ తేదీ మినహా) మాత్రమే నని తెలిపింది. ఇందుకు తదనుగుణంగా టిక్కెట్ల బుకింగ్ కూడా చేయబడుతుందని ఆర్డర్ పేర్కొంది. కానీ., అక్టోబర్ 31 వరకు 120 రోజుల ARP కింద చేసిన అన్ని బుకింగ్‌లు మారవని తెలిపింది. ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియా ఔట్! ఫైనల్‌కు దక్షిణాఫ్రికా