Andhra Pradesh: యువతి వెంట పట్టాడు.. ప్రేమించమన్నాడు.. తీరా యువతి ప్రేమించిన తర్వాత.. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి దూరం పెట్టింది.. దీంతో కక్ష గట్టిన ఆ యువకుడు.. ఆ అమ్మాయి పెళ్లి చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు.. గతంలో యువతితో దిగిన ఫొటోలను మార్నింగ్ చేస్తూ.. బ్లాక్ మెయిల్ చేశాడు.. అంతేకాదు.. పెళ్లి సంబంధం చూసేందుకు వచ్చినవారికి కూడా ఆ ఫొటోలను పంపి.. సంబంధాలు చెడగొట్టాడు.. దీంతో విసిగిపోయిన బాధిత యువతి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read Also: Bro First Single: మై డియర్ మార్కండేయ… రికార్డ్స్ ని రఫ్ఫాడిద్దాం పద
పోలీసులు తెలిపిన వివరాల మేరకు… కొత్తపేట లో నివాసం వుండే ముజామిల్, బాధిత యువతి గతంలో ప్రేమించుకున్నారు. యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువతి దూరం పెట్టింది.. ఇంట్లో పెద్దలు చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని యువతి స్పష్టం చేసింది. విషయం తెలిసిన ముజామిల్ ఎలాగైనా యువతిని ఇబ్బందులకు గురి చేయాలని ప్లాన్ చేసాడు. గతంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి యువతిని బ్లాక్ మెయిల్ చేసాడు. అంతేకాకుండా పెళ్లి సంబందానికి వచ్చే వారికి కూడా మార్ఫింగ్ ఫోటో లను పంపించాడు. దీంతో యువతి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఇక, బాధిత యువతి ఇంటికి చేరుకున్న దిశ టీం వివరాలను సేకరించారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి యువతిని ఇబ్బందులకు గురిచేసిన ముజామిల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆవేశంలో తెలియక తప్పు చేశాను, మరొకసారి యువతిని ఇబ్బంది పెట్టను అని ముజామిల్ హామీ ఇచ్చాడు. దీంతో యువతి కుటుంబసభ్యుల సూచన మేరకు ముజామిల్ కు కొత్తకోట పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.