తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే యువతిని గుర్తించారు. ఈ సంఘటన అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
రాష్ట్రంలోని మహిళలందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. ఎన్టీఆర్ జిల్లాలో దిశా యాప్ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఒకే రోజు రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకునేలా జిల్లా వ్యాప్తంగా దిశా ఎస్.ఓ.ఎస్ యాప్ పై మాస్ క్యాంపెయిన్ జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దిశా యాప్ మెగా ఈవెంట్ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమీషనర్…