Bro First Single: మై డియర్ మార్కండేయ… రికార్డ్స్ ని రఫ్ఫాడిద్దాం పద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరోస్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ కోసం మెగా ఫాన్స్ గత 24 గంటలుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ ఈ మధ్య రచ్చ లేపుతుంది పైగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకి థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యాజిక్ ‘బ్రో’ సినిమాకి కూడా వర్కౌట్ అయ్యి థమన్ నుంచి మరో ఆల్బమ్ వస్తుందని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. వారి వైటింగ్ కార్డ్ వేస్తూ ‘బ్రో’ మూవీ నుంచి ‘మై డియర్ మార్కండేయ’ అనే సాంగ్ బయటకి వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ హుక్ లైన్స్ చాలా క్యాచీగా ఉండడంతో, అందరికీ వెంటనే కనెక్ట్ అవ్వడం గ్యారెంటీ. సాంగ్ మొత్తంలో మై డియర్ మార్కండేయ, మంచి మాట చెప్తా రాసుకో అంటూ వచ్చే లైన్ కి రిపీట్ వేల్యూ ఉంది. పైగా ఈ సాంగ్ ఎక్కువగా వింటేజ్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ స్టైల్ లో ఉండడం అభిమానులకి కిక్ ఇచ్చే విషయం.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో సాంగ్ కి అండర్ కరెంట్ ఒక మంచి మెసేజ్ ఉంటుంది, అదే ఈ మై డియర్ మార్కండేయ సాంగ్ లో కూడా ఉంది. సాయి ధరమ్ తేజ్ డాన్స్ వేస్తున్నాడు కానీ యాక్సిడెంట్ తాలూకు శారీరిక ఇబ్బంది ఇంకా తగ్గినట్లు లేదు. ఒకప్పటి సాయి ధరమ్ తేజ్ గ్రేస్ కనిపించడానికి ఆ యాక్సిడెంట్ కారణం అయి ఉండొచ్చు. ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా కనిపించి యూత్ ని కవ్వించింది. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే… ఈ సాంగ్ లో వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించాడు. ఆ స్టైల్ అండ్ స్వాగ్ ఇప్పటికీ అలానే ఉన్నాయి. లిరికల్ సాంగ్ లో ఎడిట్ చేసిన పవన్ ఫొటోస్ సూపర్బ్ ఉన్నాయి. మొత్తానికి ఫస్ట్ సాంగ్ కి మెగా హీరోలు సాలిడ్ కిక్ ఇచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!