కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపై ఏ పార్టీలో కాకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్‌ను వీడినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ ఉపసంహరణతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయ్యింది. సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఎమ్‌ఐఎమ్ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లతో కలిపి 17 నామినేషన్లు దాఖలయ్యాయి.. 15 మంది సభ్యులు ఉండే స్టాండింగ్ కమిటీకి బీఆర్ఎస్ ఉపసంహరణతో ఎన్నిక లేకుండా ఎమ్ఐఎమ్, కాంగ్రెస్ సభ్యులతో ఏకగ్రీవమైంది..…