జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ ఉపసంహరణతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయ్యింది. సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఎమ్‌ఐఎమ్ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లతో కలిపి 17 నామినేషన్లు దాఖలయ్యాయి.. 15 మంది సభ్యులు ఉండే స్టాండింగ్ కమిటీకి బీఆర్ఎస్ ఉపసంహరణతో ఎన్నిక లేకుండా ఎమ్ఐఎమ్, కాంగ్రెస్ సభ్యులతో ఏకగ్రీవమైంది..…
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. బల్దియా పరిధిలో మొత్తం 150 కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. సమావేశంలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అభ్యంతరాలు తెలిపారు. వాస్తవాలకు దూరంగా బడ్జెట్ గణాంకాలు ఉన్నాయని కార్పొరేటర్లు విమర్శలు గుప్పించారు.