నేడు కర్ణాటకలో కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీ.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ రాజ్యాంగంపై దాడి ప్రధాన ప్రతిపక్షం, విపక్షాల మధ్య రాజకీయ పోరుకు దారి తీసింది. దీంతో ఈరోజు (జనవరి 21) కర్ణాటకలోని బెలగావిలో జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీతో కాంగ్రెస్ ప్రారంభించనుంది. అలాగే, ఈ నెల 27వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మస్థలం దగ్గర రాజ్యాంగ సంస్థలను బీజేపీ- ఆర్ఎస్ఎస్ స్వాధీనం…
ఈ రోజు లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ కొనసాగుతోంది. మూడో దశ ఓటింగ్ లో రాష్ట్రం కూడా ఉంది. తన కుటుంబంతో సహా అహ్మదాబాద్ లోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సామాన్య పౌరుడిలా వరుసలో నిలబడి ఓటు వేశారు.
భారత కుబేరులు అనగానే టక్కున అంబానీ, అదానీ పేర్లు చెప్పేస్తారు. దేశ సంపన్నుల జాబితాలో అంబానీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత అదానీ. మొత్తం సంపాదనలో వారు టాప్‌లో ఉండగా.. ఈ ఏడాది మాత్రం వారిని వెనక్కి నెట్టారు సావిత్ర జిందాల్. ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నివేదిక ప్రకారం.. 2023 ఏడాదిలో అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో 73 ఏళ్ల మహిళ సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లతో దేశ…
అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ భారత బిలీనియర్ గౌతం అదానీ నేతృత్వంలోని కంపెనీలపై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. అంతేకాకుండా రాజకీయంగా కూడా సంచలనం సృష్టించాయి. హిండెన్‌బర్గ్ సంస్థ ఆరోపణల నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అదానీ కంపెనీలపై విచారణ చేపట్టింది. ఈ…
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అనేది ప్రపంచంలోని అత్యంత ధనవంతుల ర్యాంకింగ్ ను వెల్లడిస్తుంది. ప్రతి బిలియనీర్ యొక్క నికర విలువల గురించి వివరాలను ఈ సంస్థ నిత్యం అందిస్తుంది.
Today Business Headlines 30-03-23: అసోచామ్ అధ్యక్షుడిగా: ఇండియాలోని ఇండస్ట్రియల్ అసోసియేషన్లలో ఒకటైన అసోచామ్‌కి ప్రెసిడెంట్‌గా అజయ్‌సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రస్తుతం స్పైస్‌జెట్ సంస్థకు సీఎండీగా వ్యవహరిస్తున్నారు. అసోచామ్.. అంటే.. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా అని అర్థం. ఈ సంఘం వందేళ్లకు పైగా సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థకు అధ్యక్షుడిగా సర్వీస్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు అజయ్ సింగ్ తెలిపారు.
Today (30-12-22) Business Headlines: ‘హైదరాబాద్ చాక్లెట్’ కొన్న రిలయెన్స్: సీనియర్ మోస్ట్ సినీ నటి శారద మరియు విజయ రాఘవన్ నంబియార్ సంయుక్తంగా 1988వ సంవత్సరంలో ప్రారంభించిన లోటల్ చాక్లెట్ కంపెనీని.. రిలయెన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చాక్లెట్ కంపెనీ ప్రస్తుతం సింగపూర్ సంస్థ సన్‌షైన్ అలైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి అనుబంధంగా.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది.
భారత్‌లోని అత్యంత సంపన్నుల టాప్ 10 జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. భారతీయ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఉండగా, మూడవ స్థానంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్మన్ శివ్ నాడార్ నిలిచారు. అయితే ఈ మూడు స్థానాల్లో గతేడాది కూడా ఇదే విధంగా వీరే ముగ్గురు ఉన్నారు. కానీ.. ముఖేశ్ అంబాని వ్యక్తిగత సంపద 90.7 బిలియన్ డాలర్లకు చేరుకుందని,…