కన్నడలో గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సీరియల్ కిల్లర్ మూవీ గరుడ పురాణ.. ఎడిటర్ మంజునాథ్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ సైకో కిల్లర్ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు అయ్యింది.. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. ఈ సస్పెన్స్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది..
ఈ సినిమాను ఉచితంగా అమెజాన్‌లో చూసే వెసులుబాటు లేదు. అమెజాన్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 79 రూపాయలు పే చేసి చెల్లించాలి.. సీనియర్ కిల్లర్ కథతో అడుగడునా సస్పెన్స్ లతో కథను రూపోందించాడు. ఈ సినిమాలో మంజునాథ్‌తో పాటు సంతోష్ కార్కి, దిశ శెట్టి కీలక పాత్రలు పోషించారు. కర్ణాటక బోర్డర్‌లో వరుసగా అమ్మాయిలు హత్యలకు గురువుతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు సీరియల్ కిల్లర్ ఎందుకు ఇలా చేస్తాడో అన్నది సినిమా కథ..
ఈ సినిమాతో డైరెక్టర్ కన్నడంలోకి ఎంట్రీ ఇస్తాడు. కాంతార, కబ్జాతో పాలు పలు కన్నడ సినిమాలకు ఆన్‌లైన్ ఎడిటర్‌గా మంజునాథ్ పనిచేశాడు. ఈ సినిమా ట్రైలర్‌ను కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ సతీమణి అశ్విని పునీత్‌రాజ్‌కుమార్ రిలీజ్ చేసింది.. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. దాంతో పాటుగా సినిమా కూడా సాలిడ్ హిట్ ను అందుకుంది.. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..