ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విశాఖపట్నంలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమయిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేసిన గవర్నర్ ప్రసంగంలో 3రాజధానుల అంశం ప్రస్తావన చేయకపోవడం ప్రభుత్వ నిర్ణయాల డొల్లతనాన్ని బహిర్గతం చేసింది.
Read Also:Satavathi Rathod : కేసీఆర్ ఆశీర్వాదంతో మహబూబాబాద్ రూపురేఖలు మారిపోయాయి
ప్రభుత్వ అస్తవ్యస్త పాలన, అనుభవ లేమి, అరాచకాలను కప్పి పుచ్చే ప్రయత్నం జరిగినట్టు కనిపించింది. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్ తో చెప్పి దాన్ని చట్టబద్దం చేసుకునే ప్రయత్నంలా అనిపించింది.సజ్జల, బుగ్గన మాట్లాడే మాటలనే ఒక సంకలనం లా చేసి గవర్నర్ చేత మాట్లాడించారు. గవర్నర్ ను స్పీకర్ ఛాంబర్ లో వేచిఉండేలా చేసి తమ నియంతృత్వాన్ని, లెక్కలేనితనాన్ని మరోసారి చాటుకున్నారని విమర్శించారు గంటా శ్రీనివాసరావు.
మొత్తంగా గవర్నర్ కూడా తనను ఈ స్థాయికి దిగజారుస్తారని అనుకుని ఉంటే ఈ పదవి తీసుకుని ఉండేవారు కాదేమోనని అనిపించేలా వ్యవహరించారని దుయ్యబట్టారు గంటా.
గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ అస్తవ్యస్త పాలన, అనుభవ లేమి, అరాచకాలను కప్పి పుచ్చే ప్రయత్నం జరిగినట్టు కనిపించింది. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్ తో చెప్పి దాన్ని చట్టబద్దం చేసుకునే ప్రయత్నంలా అనిపించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్ ఇమేజ్ ను కూడా(1/3)
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) March 14, 2023
Read Also: H3N2 Virus: హెచ్3ఎన్2 వైరస్‌తో మరొకరు మృతి.. 7కు చేరిన మరణాల సంఖ్య