మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సినిమా ‘గాంఢీవధారి అర్జున’. ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో తెరకెక్కకింది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.రీసెంట్ గా గాంఢీవధారి అర్జున ట్రైలర్ ని విడుదల చేసారు.. ‘గాంఢీవధారి అర్జున’ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది.ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. కంప్లీట్ యాక్షన్ మోడ్ లో ట్రైలర్ ని కట్ చేసాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక స్పైగా నటించాడు..ట్రైలర్ లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్, స్టంట్స్ అదిరిపోయాయి.. దీంతో సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు బాగా పెరిగాయి.
ఈ సినిమాకు ఫీల్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.ట్రైలర్ లో మిక్కి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఈ సినిమాలో విమలా రామన్, వినయ్ రాయ్, రోషిణి ప్రకాశ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెంచడానికి తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ని కూడా అనౌన్స్ చేసారు. ఆగస్టు 21న(నేడు ) సాయంత్రం ఆరు గంటలకి, జేఆర్సీ కన్వెన్షన్ లో గాంఢీవధారి అర్జున ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గెస్ట్ గా రానున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 7 గంటలకు గ్లోబల్ స్టార్ రాంచరణ్ తన చేతుల మీదుగా ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాతో నైనా వరుణ్ తేజ్ సోలో హీరోగా సాలిడ్ హిట్ కొడతాడో లేదో చూడాలి.
https://twitter.com/IAmVarunTej/status/1693529806158328195?s=20