ISRO Chief Somnath : ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శనివారం ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ స్మారక ఉపన్యాసం చేస్తూ.. రాబోయే కొన్ని ముఖ్యమైన మిషన్‌ల కోసం కొత్త తేదీలను కూడా వెల్లడించారు.
Gaganyaan: ప్రముఖ మలయాళ నటి లీనా తాను ‘గగన్‌యాన్’ వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది. భారత తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’లో పాలుపంచుకుంటున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. ప్రధాని ప్రకటన అనంతరం లీనా తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గగన్‌యాన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఒకరు. READ ALSO: Jio phone:…
Space station: 2035 నాటికి భారత్‌కి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పడుతుందని, ఇది అంతరిక్ష విషయాలను కనుగొనేందుకు, అధ్యయనం చేసేందుకు దోహదపడుతుందని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు అన్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(వీఎస్ఎస్సీ)లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో భారత వ్యోమగామని సొంత రాకెట్ ద్వారా చంద్రుడిపై దిగుతారని చెప్పారు.
గగన్‌యాన్ మిషన్ కోసం ఎదురుచూస్తున్న భారత్‌కు ఇవాళ శుభవార్త అందింది. కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను దేశానికి పరిచయం చేశారు.
Mission to Space Station: భారత్ మరో అంతరిక్ష కార్యక్రమానికి సిద్ధమవుతోంది. భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా భారత్ వైమానిక దళానికి చెందిన పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. నాసా-ఇస్రో మధ్య సహకారంలో భాగంగా పైలట్లకు శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. 2024 నాటికి భారత వ్యోమగామిని స్పేస్ స్టేషన్‌కి పంపించాలనే మనదేశం భావిస్తోంది.
PM Modi: భారత గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో ఈ రోజు ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టింది. ప్రయోగాత్మకంగా ‘టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్(టీవీ-డీ1) పరీను శనివారం విజయవంతంగా నిర్వహించింది. క్రూమాడ్యుల్‌ని రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు, ఆ తరువాత క్రూ మాడ్యుల్, రాకెట్ నుంచి విడిపోయి పారాశ్యూట్ల సాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా పడింది.
Gaganyaan Mission: భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రతిష్టాత్మక మిషన్ గగన్ యాన్ కౌంట్ డౌన్ స్టార్ అయింది. తొలుత మానవ రహిత విమాన పరీక్షకు సర్వం సిద్ధమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం (అక్టోబర్ 20) తెలిపింది.
అంతరిక్ష రంగ అభివృద్ధికి ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ను రూపొందించిందని, స్వదేశీయంగా నిర్మించిన అంతరిక్ష నౌకలో భారతీయుడు చంద్రునిపైకి వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు.
2025లో సొంత రాకెట్ తో అంతరిక్షంలోకి తమ వ్యోమగాములను కక్ష్యలోకి తీసుకురావాలని భారత అంతరీక్ష పరీశోధనా సంస్థ యోచిస్తుంది. ఎస్కేప్ సిస్టమ్ ను పరీక్షించడంలో భాగంగా ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1(TV D1) ఫ్లైట్ ను రేపు (అక్టోబర్21) ఉదయం 8 గంటలకు నింగిలోకి పంపనున్నారు. నాలుగు టెస్ట్ ఫ్లైట్ లలో ఇది మొదటిది అని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు.