ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ వేడుకను రీసెంట్గా చాలా ఘనంగా జరిపారు. కాగా.. తాజాగా పెళ్లి వేడుకలను మొదలుపెట్టారు. వివాహ వేడుకలు మే 29న ఇటలీలో ప్రారంభమై జూన్ 1 వరకు జరుగనున్నాయి. ఈ వేడుకలు స్విట్జర్లాండ్‌లో ముగియనున్నాయి. అయితే.. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్, అంతర్జాతీయ ప్రముఖులు ఎంతో మంది అతిరథ మహారథులు హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. కీలక నేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. పార్టీల అధ్యక్షులంతా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మే 13న జరుగనున్న ఎన్నికల కోసం ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించనున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జనం మద్ధతు కోరబోతున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మధ్యాహ్నం ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. 27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం.. రేపు సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ను నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.
2025లో సొంత రాకెట్ తో అంతరిక్షంలోకి తమ వ్యోమగాములను కక్ష్యలోకి తీసుకురావాలని భారత అంతరీక్ష పరీశోధనా సంస్థ యోచిస్తుంది. ఎస్కేప్ సిస్టమ్ ను పరీక్షించడంలో భాగంగా ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1(TV D1) ఫ్లైట్ ను రేపు (అక్టోబర్21) ఉదయం 8 గంటలకు నింగిలోకి పంపనున్నారు. నాలుగు టెస్ట్ ఫ్లైట్ లలో ఇది మొదటిది అని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు.
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఆదివారం ఎల్‌వీఎం-3 వాహకనౌక ద్వారా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.