వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెడ్ అలార్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా అన్ని వేళల అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ తో ఆదివారం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు సర్ ప్లస్ అవుతున్న నేపథ్యంలో లోతట్టు…
గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించడంతో జీహెచ్‌ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లింగంపల్లి నుండి గచ్చి బౌలి వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో ఈ దారి గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. వర్షపు నీరును అంచనా వేయకుండా కారు డ్రైవర్ ఈ దారి గుండా వర్షపు నీరులోకి వెళ్లడంతో బ్రిడ్జి కింద వర్షపు నీరులో కారు చిక్కుకు పోయింది.