RK Roja: సంతకం పెట్టి హామీలు అమలు చేయాని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై 420 కేసు పెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా.. తిరుపతి జిల్లా నిండ్ర మండలంలో రికాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేశానంటూ చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.. అబద్దాలు చెప్పి అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటని వ్యాఖ్యానించిన ఆమె.. సంతకం పెట్టి హామీలు అమలు చేయాని చంద్రబాబు, పవన్ పై 420 కేసు పెట్టాలని డిమాండ్ చేశారు..
Read Also: Pakistan-Bangladesh: పాక్-బంగ్లా అధికారులకు వీసా-ఫ్రీ ఎంట్రీ.. భారత్‌పై ప్రభావం..
నిరుద్యోగులను, పిల్లలు సహా అందరినీ ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఆర్కే రోజా.. సిగ్గు లేకుండా అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు.. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఏపీ అమ్మేయాలని అంటున్నాడు అని మండిపడ్డారు.. ప్రతి నెల 1500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి మోసం చేశారు… రెండు కోట్ల మందికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు.. హామీ ఇచ్చేటప్పుడు మీకు తెలియదా..? అని నిలదీశారు.. కేవలం అధికారం కోసమే హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు.. ఇలాంటి వారికి ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుపడాలి… కానీ, మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు రోజా.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ప్రీ బస్సు అంటూ మోసం చేశారని మండిపడ్డారు.
Read Also: Bihar: స్కూల్‌లో “నాగమణి”ని వదిలి వెళ్ళిన తాచు పాము..? అలాంటి మణి నిజంగా ఉందా..?
మరోవైపు, శ్రీశైలం మాజీ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి పెద్ద వెన్నుపోటుదారుడు అని ఫైర్ అయ్యారు రోజా.. నిండ్ర మండలంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు… సొంత చిన్నాన్న మాజీ మంత్రి చెంగారెడ్డికి వెన్నుపోటు పొడిచాడు, తరువాత నా దగ్గర పదవులు, లబ్ధిపొంది నాకు వెన్నుపోటు పొడిచాడు.. కానీ, ఇప్పుడు గాలి భాను ప్రకాష్ వెన్నుపోటు పోడవకుండా ఉంటారా? అని ప్రశ్నించారు.. నా వల్ల లబ్ధిపొంది నాకే వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు పార్టీలో చేరారంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా..