No iPhone 18: యాపిల్ లవర్స్‌కు షాక్.. ‘ఐఫోన్ 18’ లేనట్లేనా?
- ఐఫోన్ లవర్స్‌కు యాపిల్ బిగ్ సర్‌ప్రైజ్
- రెగ్యులర్ ఐఫోన్ 18 మోడల్ రిలీజ్ లేనట్లేనా
- తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌పై యాపిల్ దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’.. ఐఫోన్ లవర్స్‌కు ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం.. 2026లో రెగ్యులర్ ‘ఐఫోన్ 18’ మోడల్ రిలీజ్ ఉండదని సమాచారం. తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌తో పాటు iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లపైనే యాపిల్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో మొబైల్ మార్కెట్‌లో మరోసారి సంచలనం సృష్టించాలనే ప్లాన్‌లో యాపిల్ ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
2026లో లాంచ్ కానున్న ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడళ్లు పూర్తిగా కొత్త డిజైన్‌తో రానున్నాయని తెలుస్తోంది. ప్రో మోడల్ 6.3 అంగుళాలు, ప్రో మాక్స్ 6.9 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులోకి రానున్నాయి. వీటిలో కొత్త A20 Pro చిప్‌సెట్‌తో పాటు యాపిల్ డెవలప్ చేసిన C2 మోడెమ్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మోడళ్లలో డైనమిక్ ఐలాండ్ లేకపోవడం విశేషం. ఇది యాపిల్ డిజైన్‌లో ఒక పెద్ద మార్పు అనే చెప్పాలి. కెమెరా విషయంలో కూడా భారీ అప్‌గ్రేడ్‌లు ఉండనున్నాయి. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో 48MP + 48MP + 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుందని సమాచారం. ఫ్రంట్ కెమెరా కూడా 24MPకి అప్‌గ్రేడ్ అవుతుందని తెలుస్తోంది. దీంతో ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్‌లో మరో స్థాయికి తీసుకెళ్లాలని కంపెనీ టార్గెట్ అని స్పష్టంగా తెలుస్తోంది.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
Also Read: T20 World Cup 2026: ఐసీసీ టోర్నీల్లో బహిష్కరణ మ్యాచ్‌లు.. లిస్టులో టాప్ టీమ్స్!
అందరిలో ఆసక్తిని రేపుతున్న అంశం యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్. ‘iPhone Fold’ పేరుతో వచ్చే ఈ డివైస్‌లో కూడా A20 చిప్, C2 మోడెమ్ ఉండనున్నాయి. 5500mAh భారీ బ్యాటరీతో ఇది మార్కెట్‌లోకి రానుందని అంచనా. ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో ఇప్పటికే ఉన్న శాంసంగ్, వివో, గూగుల్, మోటో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కంపెనీ పని చేస్తోందట. 2026లో యాపిల్ వ్యూహం పూర్తిగా మారినట్టే కనిపిస్తోంది. రెగ్యులర్ మోడల్‌కు బ్రేక్ ఇచ్చి.. ప్రో సిరీస్, ఫోల్డబుల్ ఐఫోన్‌తోనే మార్కెట్‌ను షేక్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇదే నిజమైతే.. 2026 యాపిల్ అభిమానులకు ఓ హిస్టారికల్ ఇయర్‌గా మారడం ఖాయం.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!