DDC 0001 Number Plate: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు.. సొంతం చేసుకున్న తెలుగోడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DDC 0001 Number Plate: ఈ రోజుల్లో లగ్జరీ కార్ల క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి కొన్నిసార్లు కారు కంటే ఆ కారుకు ఉండే ‘నెంబర్ ప్లేట్’ ధర చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. తాజాగా ఇండియాలో ఒక వింటేజ్ వీఐపీ నంబర్ ప్లేట్ ఏకంగా ఓ లగ్జరీ విల్లా ధరను పలికి సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆ కార్ నెంబర్ ప్లేట్ ధర ఎంత, దానిని ఎవరు సొంతం చేసుకున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: T20 World Cup 2026: ఐసీసీ టోర్నీల్లో బహిష్కరణ మ్యాచ్‌లు.. లిస్టులో టాప్ టీమ్స్!
Also Read
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
ప్రముఖ లగ్జరీ యూజ్డ్ కార్ డీలర్‌షిప్ సంస్థ ‘బిగ్ బాయ్ టాయ్జ్’ ఇటీవలే తన కొత్త వేలం గృహాన్ని ప్రారంభించింది. హై-వాల్యూ సేకరణల కోసం దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ వేదికలో “DDC 0001” అనే వింటేజ్ నంబర్ ప్లేట్‌ను వేలానికి ఉంచారు. బిగ్ బాయ్ టాయ్జ్ అధినేత జతిన్ అహుజాకు చెందిన ఈ ప్రత్యేక నంబర్ ప్లేట్ కోసం వేలంలో తీవ్రంగా పోటీ సాగింది. చివరికి ఈ నెంబర్ ప్లేట్ రూ. 2.08 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారతదేశంలోఇప్పటివరకు వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్లలో ఒకటిగా ఇది చరిత్ర సృష్టించింది. ఇక్కడ విశేషమేమిటంటే, ఇంత భారీ ధర చెల్లించి ఈ నంబర్‌ను దక్కించుకున్నది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన కిరణ్ కోల్పాకుల.
వేలంలో సెలబ్రిటీల కార్లు ..
ఈ ఆక్షన్ హౌస్ కేవలం నంబర్ ప్లేట్లకే పరిమితం కాలేదు. ప్రముఖ సెలబ్రిటీలు వాడిన లగ్జరీ వాహనాలను కూడా ఇక్కడ విక్రయానికి ఉంచారు. శిల్పా శెట్టి ఉపయోగించిన మెర్సిడెస్-మేబాచ్ GLS 600, రోహిత్ శెట్టి మెర్సిడెస్-బెంజ్ CLA 200d, దినేష్ కార్తీక్ రేంజ్ రోవర్ స్పోర్ట్ SVR అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కేవలం వాహన నంబర్లే కాదు, అరుదైన మొబైల్ నంబర్లకు కూడా డిమాండ్ భారీగా ఉంది. త్వరలో “CHE 78”, “HR59 0001” వంటి మరిన్ని వింటేజ్ నంబర్ ప్లేట్లు, “999999999X”, “88888888X” వంటి ఫ్యాన్సీ మొబైల్ నంబర్లు కూడా వేలానికి రానున్నాయి. సంపన్నులు, కస్టమర్ల కోసం పారదర్శకమైన వేదికను అందించడమే తమ లక్ష్యమని, ఈ రూ. 2.08 కోట్ల వేలం ఆ నమ్మకాన్ని బలపరిచిందని వేలం నిర్వాహకుడు జతిన్ అహుజా పేర్కొన్నారు.
READ ALSO: Couple Friendly Trailer: ఎంత మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసావ్?
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!