ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. మమత హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలు అభివృద్ధే లక్ష్యంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పని చేశారు.. ఇది అనుకోని ప్రోగ్రామ్, ఇక్కడకు ఇంతమంది సోదరులు వస్తారనుకోలేదు.. మా ఆడబిడ్డలు ఇంత తోపులాటలో ఇక్కడ వరకు వస్తారనుకోలేదు.. తెలంగాణ ప్రజలు మనకు రెండు దఫాలు అవకాశం ఇచ్చారు.. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లు నిర్మాణ బద్ధంగా పని చేశాం.. ప్రతి రంగంలో ఏ రంగమైన తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం.
Also Read:Sentiment Star : ఒక్క డిజాస్టర్ దెబ్బకు 15ఏళ్ల సెంటిమెంట్ ను పక్కన పెట్టిన స్టార్ హీరో
2014 లో 64 సీట్లు సాధిస్తే, 2018 లో 88 సీట్లతో రెండవసారి అధికారంలోకి వచ్చాం.. రాహుల్ గాంధీని పిలిచి నోటికి వచ్చినట్లు బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు.. యువతకు కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చారు.. ఆడబిడ్డలు కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తుంటే, తులం బంగారం ఇస్తాం అంటే నమ్మి ఓటు వేసి గెలిపించి మోసపోయారు.. వృద్ధులకు కూడా సినిమా చూపించారు, కేసీఆర్ ఒకరికి పింఛన్ ఇస్తుంటే మేము ఇద్దరికి ఇస్తామని మోసం చేశారు.. బలహీన వర్గాల సోదరులు నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించారు.
Also Read:Petrol: దండంరా సామీ.. పెట్రోల్ పోస్తుండగా బైక్ లో మంటలు..
ఒకవిధంగా చెప్పాలి అంటే ఇది మనకు మంచిది, కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లు, కేసీఆర్ భోజనం పెడుతుంటే, ఆయన బిర్యానీ పెడతాడు అని గెలిపిస్తే మోసం చేశారు.. ఇలాంటి దుర్మార్గులు ఉంటారని ఆరోజుల్లో అంబేద్కర్ ఊహించలేదు, అందుకే రీకాల్ వ్యవస్థ పెట్టలేదు. ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్లు శిక్ష పడుతుందని అప్పుడు అర్ధం కాలేదు.. ముగ్గురు మొనగాళ్ల లాగా, ముగ్గురు మంత్రులు తిరుగుతున్నారు.. అందులో ఒకాయన బాంబుల మంత్రి.. పోయిన దీపావళి కి బాంబులు పేళతాయని ఇంతవరకు పేలలేదు.. ఆనాటి రోజులు తీసుకుని వచ్చామని పాట పెట్టారు అదే చేశారు ఎరువుల కోసం చెప్పులు వరుసలో పెట్టే కర్మ వచ్చింది.. నాడు మేము పోటీ చేస్తే మీరు పని చేశారు, మీ ఎన్నికలకు మేము పని చేస్తాం.
Also Read:Felix Baumgartner: సూపర్‌సోనిక్ స్కైడైవ్ మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ కన్నుమూత
ప్రజలకు కాంగ్రెస్ పని తీరు పట్ల వాంతులు అయ్యేలా ఉన్నాయి, కావున మన పార్టీని ఉమ్మడి జిల్లాలో మనం అత్యధిక స్థాయిలో గెలుపొందాలి.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భరతం పట్టే బాధ్యత మన పైనే ఉంది.. డబ్బులు పంచి గెలవాలని వాళ్లు బావిస్తున్నారు, వారి భరతం మనం పడదాం.. నియోజకవర్గాల వారీగా, మండలాల వారిగా మనం సమావేశాలు ఏర్పాటు చేద్దాం.. పార్టీ నుండి మీకు సహాయ సహకారాలు అందుతాయని కేటీఆర్ తెలిపారు.