Sentiment Star : ఒక్క డిజాస్టర్ దెబ్బకు 15ఏళ్ల సెంటిమెంట్ ను పక్కన పెట్టిన స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత 15 సంవత్సరాల నుండి ఫాలో అవుతోన్న ఈద్ సెంటిమెంట్‌ను పక్కన పెట్టేస్తున్నాడట. ఈ పండుగ రోజున తన మూవీస్ రిలీజ్ చేసే అలవాటును పదే పదే రిపీట్ చేస్తున్నాడు సల్లూభాయ్. వాంటెడ్ నుండి రీసెంట్లీ సికిందర్ వరకు సుమారు డజన్ సినిమాలను తీసుకు వచ్చాడు. ఈద్ రోజున సినిమాలు రిలీజ్ చేస్తే అల్లా ఆశీస్సులుంటాయని బలంగా నమ్మే సల్మాన్ ఖాన్ సికిందర్ ఆల్ట్రా డిజాస్టర్ కావడంతో.. నెక్ట్స్ మూవీ రిలీజ్ విషయంలో ఆలోచనలో పడ్డాడట.
Also Read : Sitara entertainments : ఒక బాణం రెండు పిట్టలు.. జాక్ పాట్ కొట్టిన నాగవంశీ
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
సికిందర్ ప్లాప్ తర్వాత సల్మాన్ ఖాన్ ఆచితూచి ఎంచుకున్న ప్రాజెక్ట్ ‘బాటిల్ ఆఫ్ గాల్వన్’. గాల్వన్ లోయలో చైనా సైనికునితో వీరోచిత పోరాటం చేసి మరణించిన తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లఖియా. ఆ సినిమా రిలీజ్ ఎప్పడన్నది టీం క్లారిటీ ఇవ్వలేదు. కానీ సల్మాన్‌కు ఈద్‌కు తన సినిమాను తెచ్చే అలవాటు ఉన్న నేపథ్యంలో నెక్ట్స్ ఫెస్టివల్‌కు వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నారంతా. కానీ కండల వీరుడు ఈ సారి సెంటిమెంట్ తీసి పక్కనపెట్టేస్తున్నాడని టాక్. బాటిల్ ఆఫ్ గాల్వన్‌ను నెక్ట్స్ ఇయర్ జనవరి లేదా జూన్‌లో థియేటర్లలోకి తీసుకు రావాలని అనుకుంటున్నాడ సల్మాన్. షూటింగ్ 55-60 డేస్‌లో కంప్లీట్ చేసి జనవరిలో తేవాలని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అయితే జూన్ గురించి థింక్ చేయాలని చూస్తున్నారట. మేకర్స్ ఆలోచన కూడా ఇలాగే ఉందని తెలుస్తోంది. అయితే బీటౌన్ నుండి అందుతోన్న సమాచారం ప్రకారం.. నెక్ట్స్ రంజాన్ కు ఇప్పటికే మూడు సినిమాలు కర్చీఫ్ వేసేకున్నాయి. ధమాల్ 4, రణవీర్, విక్కీ కౌశల్ లవ్ అండ్ వార్, టాక్సిక్ మార్చి 19, 2026న రిలీజ్ ప్లాన్ చేస్తున్నాయట. ఇంత పెద్ద కాంపిటీషన్ ఉంది కాబట్టే.. సార్ రావడానికి వెనకాడుతున్నాడన్నది టాక్.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!