తెలంగాణ భవన్‌లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలతో పాటు హరీష్ రావు, కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “ఈరోజు రాత్రి మా అమ్మాయి అమెరికా వెళ్తుంది.. తొందరగా వెళ్లి కలవాలి. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందులతో పోలిస్తే ఈ ఇబ్బంది ఎంత.. ఇదొక లొట్టపీసు కేస్.. వాడు ఒక ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి. ఆయన పీకేది ఏమి లేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టినా బిడ్డగా చెబుతున్న.. ఇది నాకు ఇబ్బంది అసలే కాదు. ఇక్కడ త్రీడి పాలన నడుస్తోంది. డైవర్షన్, డిస్ట్రాక్షన్, డిమోలిషన్ అనేది మాత్రమే నడుస్తోంది. నిన్న ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ లో 90 లక్ష ల మందికి 2500 ఇస్తున్నాం అన్నారు. ఎంత అబద్ధాలు ఆడుతున్నారు చూడండి.” అని కేటీఆర్ పేర్కొన్నారు.
READ MORE: Aishwarya Rajesh: నాకు ‘8’ సెంటిమెంట్.. కానీ నా మేనల్లుడు మాత్రం అదే నెంబర్ నింపేస్తాడు!
ఈ కేసు సంగతి తాను చూసుకుంటానని.. తనకు మంచి లీగల్ టీమ్ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. “కేసు గురించి మేము కొట్లాడతాం. కేసు గురించి మీరు టెన్షన్ పడకండి. ఇప్పుడు రైతుల సమస్యలపై అందరం కొట్లాడతాం. రైతు రుణమాఫీ అందరికీ జరగలేదు. మనం తప్పు చేయలేదు. సుప్రీంకోర్టు వరకు అయినా పోదాం.. కొట్లాడదాం. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కష్ట పడ్డాం. ఈ సంవత్సరం కమిటీలు వేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసుకుందాం. కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడతాం.” అని వెల్లడించారు.
READ MORE: Free Replacement Policy: ‘వన్‌ప్లస్’ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. పాడైతే ఉచితంగా కొత్త ఫోన్!