చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ లవర్స్‌కి గుడ్‌న్యూస్. వన్‌ప్లస్ తాజాగా ఫ్రీ రీప్లేస్‌మెంట్ పాలసీని ప్రకటించింది. ఇకపై హార్డ్‌వేర్ పరంగా ఏదైనా సమస్య తలెత్తితే.. మీ ఫోన్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తారు. అయితే ఈ పాలసీ అన్ని ఫోన్లకు మాత్రం కాదండోయ్. తాజాగా లాంచ్ అయిన వన్‌ప్లస్ 13 సిరీస్‌పై మాత్రమే ఫ్రీ రీప్లేస్‌మెంట్ పాలసీని కంపెనీ ప్రకటించింది. గతేది చైనాలో రిలీజ్ అయిన వన్‌ప్లస్ 13 సిరీస్.. నిన్న (జనవరి 7) భారత్‌లో లాంచ్ అయింది.
వన్‌ప్లస్ 13 సిరీస్‌లోని వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ 5జీ ఫోన్లను ఫిబ్రవరి 13లోపు కొనుగోలు చేసేవారికి ఫ్రీ రీప్లేస్‌మెంట్ పాలసీని అందిస్తోంది. 180 రోజుల్లో (6 నెలలు) హార్డ్‌వేర్ పరంగా ఏదైనా సమస్య తలెత్తితే.. ఫోన్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తారు. 6 నెలలకు మించి కవరేజీ కావాలంటే.. వన్‌ప్లస్ 13కి రూ.2599, వన్‌ప్లస్ 13ఆర్‌కు రూ.2299 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము చెల్లిస్తే మరో మూడు నెలల ఫ్రీ రీప్లేస్‌మెంట్ పాలసీ లబిస్తుంది. గ్రీన్‌లైన్ సమస్యపై వన్‌ప్లస్ యూజర్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కంపెనీ కొత్త పాలసీని తీసుకొచ్చింది.
Also Read: Chiranjeevi-Anil Ravipudi: చిరు-అనిల్ సినిమాకు ముహూర్తం ఫిక్స్?
వనప్లస్ 13 ఫోన్ విక్రయాలు జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. వన్‌ప్లస్ 13 ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.69,999గా.. 16జీబీ+512జీబీ ధర రూ.76,999గా.. 24జీబీ+1టీబీ ధర రూ.89,999గా కంపెనీ నిర్ణయించింది. మిడ్‌నైట్ ఓషన్, ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్ రంగుల్లో ఇది లభ్యం కానున్నాయి. వన్‌ప్లస్ 13 ఆర్ 12జీబీ+256జీబీ ధర రూ.42,999గా.. 16జీబీ+512జీబీ ధర రూ.49,999గా ఉంది. జనవరి 13 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఆస్ట్రల్ ట్రయల్, నెబ్యులా నొయిర్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. రెండింటిలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్లకు నాలుగేళ్ల ఓఎస్ అప్‌డేట్స్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కంపెనీ ఇస్తోంది.