తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా త్రిపుల్ ఆర్.. అన్ని దేశాల సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది.. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంత బాగా నచ్చిందో తెలిసిందే.. ఇప్పటికి సినిమాకు అక్కడ క్రేజ్ తగ్గలేదు.. ఈ క్రమంలో జపాన్ లో త్రిపుల్ ఆర్ సినిమాను రీరిలీజ్ చేశారు.. ఇప్పుడు కూడా అదే రెస్పాన్స్ జనాల నుంచి రావడం విశేషం.. ప్రస్తుతం రాజమౌళి జపాన్ లో ఉన్నాడు.. అక్కడ ఏర్పాటు చేసిన స్పెషల్ మీట్ లో రాజమౌళి త్రిపుల్ ఆర్ సీక్వెల్ పై క్లారిటి ఇచ్చారు..
డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు మంచి ఫాలోయింగ్ అండ్ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ మీద రాజమౌళి జపాన్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చారు.. ఖచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ సినిమా ఉంటుంది చెప్పేసాడు.. ఇక ఈ సినిమా రైటర్ కూడా సినిమా సీక్వెల్ పై గతంలో క్లారిటీ ఇచ్చారు..
జపాన్ లో ఈ సినిమాను స్పెషల్ స్క్రీన్ పై వేశారు.. ఈ సందర్బంగా అక్కడకు వెళ్లిన జక్కన్న అక్కడ అభిమానులతో ముచ్చటించారు.. త్రిపుల్ ఆర్ 2 ఉంటుందని అక్కడే అనౌన్స్ చేశాడు. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాడు. మహేష్ బాబు చాలా అందగాడని జపాన్ ఆడియెన్స్‌కి చెప్పాడు.. అతన్ని కూడా ఇక్కడ తీసుకొస్తాను.. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతుందని చెప్పాడు.. జక్కన్న తో సినిమా అంటే మూడేళ్లు పడుతుంది.. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు బిజీగా ఉన్నారు.. మరి ఒప్పుకుంటారా అని నెట్టింట ఫ్యాన్స్ పెద్ద చర్చ చేస్తున్నారు..
#RRR 2 🥳🥳🥳
It’s official now 😍#RRR2 #SSRajamouli #JrNTR #RamCharan pic.twitter.com/LKIYUqySbw— Kalyan_Kms_Majnu (@kalyankmsmajnu) March 18, 2024