సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. లొనాక్ సరస్సుపై మేఘాలు విస్ఫోటనం చెందడం వల్ల అది పొంగిపొర్లడంతో తీస్తా నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 10 మంది మృతి చెందారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 82 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా వరదల దాటికి 14 వంతెనలు కూలిపోయాయి.