Amarnath Yatra 2023: సుప్రసిద్ధ అమర్‌నాథ్ యాత్రకు.. జమ్మూకశ్మీర్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ్టి నుంచి యాత్రికులు.. మంచు శివలింగం దర్శనానికి వెళ్లనున్నారు. ఇవాళ్టి నుంచి ఆగస్టు 31 వరకు అమర్ నాథ్ యాత్ర కొనసాగనుంది.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం.. వార్షిక యాత్ర రెండు నెలలు కొనసాగనుంది. మొత్తం 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. రెండు మార్గాల ద్వారా అమర్‌నాథ్ గుహకు చేరుకోనున్నారు భక్తులు. మొదటి మార్గంలో వెళ్లేవారు పెహల్గావ్ నుంచి పంచతరణికి వెళ్లి.. అక్కడి నుంచి గుహకు చేరుకుంటారు. రెండోమార్గం శ్రీనగర్ నుంచి బాల్తాల్‌కు వెళ్లి.. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల ప్రయాణించి.. మంచులింగాన్ని దర్శించుకుంటారు.
Read Also: Blast at Pharma Company: అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే..!
అమర్‌నాథ్ యాత్ర కాన్వాయ్, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని.. దాడులు జరగవచ్చని నిఘా విభాగం హెచ్చరించింది. ఇందు కోసం ఇద్దరు కశ్మీరీ యువకులకు బాధ్యతలు అప్పగించినట్లు ఇంటెలిజెన్సీ హెచ్చరించింది. రాజౌరీ-పూంఛ్, పిర్ పంజాల్, చీనాబ్ వ్యాలీ ప్రాంతాల్లో ఉగ్రదాడుల జరిగే ఛాన్స్ ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దాడులకు పాల్పడుతారని అనుమానిస్తున్న ఇద్దరు యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వారి కుటుంబసభ్యులపైన నిఘా పెట్టారు. ఇక, పాకిస్తాన్ కేంద్రంగా విధ్యంసాలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం రావడంతో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయ్. అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేపట్టారు. సీఆర్‌పీఎఫ్‌తో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు నిఘాను పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది యాత్ర మధ్యలో భీకర గాలులు వ్యాపించడం.. వరదలు రావడంతో.. ఐటీబీపీ సిబ్బంది అద్భుతంగా పని చేసింది.